స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు20 : స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థికి డెంగ్యూ ఫీవర్ సోకడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు. సోమవారం సోషల్ వెల్ఫేర్ పాఠశాలలలో చదువుచున్న 7వ తరగతి చదువుచున్న అజయ్ కుమార్ అనే విద్యార్థి ఈ నెల8న ఇంటికి వెళ్లి 13న తిరిగి పాఠశాలకు వచ్చినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.
ఆ తరువాత జ్వరం రావడంతో ఈ నెల 18న స్టేషన్ ఘన్పూర్లోని ప్రభుత్వ దవాఖానలో రక్త పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ అని నిర్ధారణ అయింది. కాగా మెరుగైన చికిత్స నిమిత్తం అదే రోజు విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల నుండి తీసుకపోయినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. కాగా బుధవారం పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డా.రుబీనా, ఆర్ఎస్ మెడికల్ ఆఫీసర్ డా.అజయ్ కుమార్, సీహెచ్ వెంకటస్వామి,
శేషయ్య, డాపవన్ మెడికల్ క్యాంపు నిర్వహించి 44 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించినట్లు డా. రుబీనా తెలిపారు.
పాఠశాల విద్యార్థులకు వ్యాధులు సోకకుండా దోమల నివారణ కోసం స్ప్రే చేయించామని ప్రిన్సిపాల్ రఘుపతి తెలిపారు. అయితే సానిటేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించి ప్రమోషన్ పై స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్గా వచ్చిన రాధాకృష్ణ ఎస్సీ కాలన, మోడల్ కాలనీలో మురుగునీరు నిల్వ ఉండి దోమల బెడద ఉందని ప్రజలు చెప్పిన వాటి నివారణకు చర్యలు
తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపించారు.