వీరభద్రాపురంలో మందుపాతర
పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలతో సామాన్యులతోపాటు వన్యప్రాణులు చనిపోతున్నట్లు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
- నిర్వీర్యం చేసిన పోలీసులు
ములుగు, జూన్ 9 (నమస్తే తెలంగాణ): పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలతో సామాన్యులతోపాటు వన్యప్రాణులు చనిపోతున్నట్లు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లోని వెంకటాపురం(నూగూరు) మండల పరిధి అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరభద్రాపురం అటవీ సమీపంలో సామాన్యులు తిరిగే కాలిబాటల వెంట మావోయిస్టులు అమర్చిన నాలుగు మందు పాతరలను ఆదివారం ఉదయం గుర్తించినట్లు పేర్కొన్నారు. అందులో మూడు పేలడంతో వన్య ప్రాణులైన ముళ్లపంది, కొండెంగ, పెంపుడు కుక్క చనిపోగా కళేబరాలను గుర్తించినట్లు వివరించారు. అక్కడే అమర్చి ఉన్న మరో మందుపాతరను బాంబు డిస్పోజల్ టీమ్ నిర్వీర్యం చేసిందని వెల్లడించారు. మావోయిస్టులకు ప్రజలు ఎవరూ సహకరించొద్దని, వారి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ కోరారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

