ఖిలావరంగల్, మార్చి 02: శివనగర్‌లోని మహాగణపతి, సుబ్రహ్మణ్య, లలితాదేవి, శివ, పంచముఖ ఆంజనేయ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి వారి పుష్కరకాల కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. రుత్వికుల వేదమంత్రోచ్ఛరణలతో శివనగర్ ప్రాంతమంతా మారుమోగింది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ మహోత్సవంలో భాగంగా తొలి రోజు బుధవారం దత్తపీఠం ఉత్తరాధికారి విజయానందతీర్థస్వామి శిష్య బృందం, రుత్వికుల ఆధ్వర్యంలో గోవు, గోవత్స పూజలు, యాగశాల ప్రవేశం చేశారు.
ఈ సందర్భంగా గురు వందంనం, గణపతిపూజ, పుణ్యాహవచనం, రక్షాంబంధనం, దీక్షాధారణ, పంచగవ్య ప్రార్థన అంకురారోపణ చేశారు. అలాగే మండపారాధన, కలశాల స్థాపన అనంతరం తొలుత గణపతి, వాస్తు, సహస్రమోదక హోమాలు నిర్వహించి లఘు పూర్ణాతి చేశారు. గోధూలి వేళ ఆవాహిత దేవతాపూజ, రుద్రమహోహాలు నిర్వహించి భక్తులకు తీర్ధప్రసాదాలు అందచేశారు.
మహిళలు సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, కుంకుమార్చన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు అధ్యక్షుడు వడ్నా మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మంచాల కృష్ణమూర్తి, కోశాధికారి చింతం యాదగిరి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీరాం రాజేష్, బత్తుల నవీన్, బుదారపు భాస్కర్, ఆడెపు సాంబమూర్తి, కుడికాల సుధాకర్, కొండి రాజమౌళి, కొత్తగట్టు నరసింహామూర్తి, డాక్టర్ పొన్న దశరథం, మీసా సత్యనారాయణ, శామంతుల భిక్షపతి, రావికం అశోక్, నాయిని అనిల్, తదితరులు పాల్గొన్నారు.