నమస్తే తెలంగాణ నెట్వర్క్ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ముగిసింది. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. వరంగల్ ఏవీవీ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద టెంట్లు తొలగించటంపై బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అలాగే, కరీమాబాద్ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తరఫున ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచుతున్నారని పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేశారు. ఉదయం 7 గంటలకు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను పరిశీలించిన తర్వాత అధికారులు సీల్ వేశారు. 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం నాలుగు గంట ల వరకు క్యూలో ఉన్న పట్టభద్రులకు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన 59 పోలింగ్ కేంద్రాలల్లో 43,812 మంది ఓటర్లకు గాను 70.83 శాతం మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య వరంగల్ కలెక్టరేట్లోని డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ (డీఆర్సీ)కు తరలించారు. కాగా, వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ సరళిని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు. అలాగే, కాశీబుగ్గ జంక్షన్, వివేకానంద కళాశాల ప్రాంగణంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. పర్వతగిరిలో పోలింగ్ సరళిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించి, కార్యకర్తలను ఓటర్లను కలిశారు.
అలాగే, రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు వర్ధన్నపేటలోని పోలింగ్ కేంద్రాలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్ సందర్శించారు. జిల్లా రిటర్నింగ్ అధికారి పీ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీఆర్వో శ్రీనివాస్ జిల్లాలో జరిగిన పట్టభద్రుల పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. నర్సంపేటతో పాటు నెక్కొండలో ఎన్నికల సరళిని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. నర్సంపేట మండలంలో 74 శాతం ఓటింగ్ నమోదైంది. చెన్నారావుపేట మండలంలో సాయంత్రం 4 తర్వాత 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన యువతిని అధికారులు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించక పోవడంతో ఓటు వేయకుండానే వెనుతిరిగింది.
నెక్కొండ మండలంలో 71.90 శాతం పోలింగ్ నమోదుకాగా, నల్లబెల్లి మండలంలో 1,807 మందికి 1,259 ఓట్లు పడ్డాయి. నల్లబెల్లి జడ్పీ పాఠశాలలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నతో పాటు పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖానాపురంలో 75.74 శాతం ఓటింగ్ నమోదైంది. మండల కేంద్రంలోని పోలింగ్ బూత్‌లను బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి సందర్శించారు. ఆయన వెంట ఎంపీపీ ప్రకాశ్‌రావు, బత్తిని శ్రీనివాస్‌గౌడ్, మస్తాన్, ముచ్చా యాదగిరిరావు ఉన్నారు. వర్ధన్నపేట మండలంలో 77.72 శాతం నమోదైంది.
రాయపర్తి మండలంలో పోలింగ్ సజావుగా సాగేందుకు తహసీల్దార్ ఎం శ్రీనివాస్ పర్యవేక్షణ చేపట్టగా వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జీడీ సూర్య ప్రకాశ్, ఎస్సై వడ్డే సందీప్‌కుమార్ బందోబస్తులు నిర్వహించారు. హసన్‌పర్తి మండలంలో బీఆర్ఎస్ నాయకులు ఓటర్లకు టెంట్లు, తాగునీటి వసతు లు కల్పించారు. డివిజన్ అధ్యక్షులు నరెడ్ల శ్రీధర్, సాంబయ్యనాయక్, ఏ రవీందర్, పీ శ్రీధర్, పార్టీ మండల అధ్యక్షుడు రజినీకుమార్ పాల్గొన్నారు. పర్వతగిరిలో 1,742 మం దికి 1,301 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐనవోలు మండలంలో 76.48 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, టెంట్లు సరిగా ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు ఎండలో ఇబ్బందులు పడ్డారు.
ఎమ్మెల్సీ పోలింగ్ హనుమకొండ జిల్లాలో 71.21శాతం నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, హనుమకొండ కలెక్టర్ సిక్తాపట్నాయక్ తెలిపారు. జిల్లాలో మొత్తం 31,141 మంది పట్టభద్రులు ఓటు వేయగా, అందులో పురుషులు 18,715, 12, 426 మంది ఉన్నట్లు వివరించారు. పోలింగ్ అనంతరం పోలీస్ భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లు, ఇతరుల ఎన్నికల సామగ్రిని అధికారులు, సిబ్బంది హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని రిసెప్షన్ కేంద్రంలో అప్పగించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హకు వినియోగించుకున్నారు.
ఆత్మకూరు మండలంలోని 16గ్రామాల్లో 1,890 మంది పట్టభద్రులు ఉండగా, అందులో 1,492 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం రెండు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మొత్తం 78.60 శాతం ఓట్లు పోలైనట్లు తహసీల్దార్, మండల సెక్టార్ అధికారి జగన్మోహన్రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ సందర్శించారు. పోలింగ్ తీరుపై మండల సెక్టార్ అధికారి జగన్మోహన్రెడ్డి, సీఐ క్రాంతి కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.
పరకాల ఏసీపీ కిశోర్‌కుమార్ పాల్గొన్నారు. దామెర మండలంలో 1,331 మంది పట్టభద్రులు ఉండగా, 1,007 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 671 పురుషులు, 336 మహిళలు ఉన్నారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండల కేంద్రంలో పోలింగ్ తీరును పరిశీలించారు. ఎస్సై కొంక అశోక్ బందోబస్తు నిర్వహించారు. కాజీపేట పట్టణంలోని ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి పరిశీలించారు. 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, బీఆర్ఎస్ నాయకులు గబ్బెట శ్రీనివాస్, శిరుమల్ల దశరథం, పాలడుగుల శివకుమార్, నయీం జుబేర్, అఫ్జల్, దువ్వ కనుకరాజు, మర్యాల కృష్ణ, సుంచు అశోక్, తేలు సారంగపాణి, బస్వ యాదగిరి, సోనీ, వెనిశెట్టి రఘు, దానం, పర్వీనా బేగం, నరేశ్, మైలారం శంకర్ పాల్గొన్నారు.
ధర్మసాగర్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 34, 35, 36 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా మొత్తం 1,710 మంది ఓటర్లకుగాను 1,413 మంది తమ ఓటుహక్కు వినియోగించుకుకున్నారు. ధర్మసాగర్, వేలేరు మండలంలోని పోలింగ్ కేంద్రాల వద్ద మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కలిసి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. వేలేరు మండలంలో మొత్తం 706 ఓటర్లు ఉండగా 561 ఓట్లు పోల్ అయ్యాయి. శాయంపేట మండలంలో 77.09 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలంలో 1,908 మంది పట్టభద్రులు ఉండగా 1,471 మంది ఓటు వేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ తీరును పరిశీలించారు. పరకాల ఏసీపీ కిశోర్‌కుమార్ బందోబస్తు పర్యవేక్షించారు.
ఎస్సై ప్రమోద్, పోలీసులు కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించారు. గీసుగొండ ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలలో మొత్తం 4 పోలింగ్ ఏర్పాటు చేశా రు. మండలంలోని 21 గ్రామాలతోపాటు గ్రేటర్ వరంగల్ 15, 16 డివిజన్లలోని మొత్తం 2,965 మంది పట్టభద్రుల్లో 2,363 మంది ఓటు వేయగా, 79శాతం నమోదైనట్లు తహసీల్దార్ రియాజుద్దీన్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గీసుగొండ మం డల కేంద్రంలో ఎమ్మెల్సీ పోలింగ్ సరళిని పరిశీలించారు.
జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, పార్టీ మండల కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు శిరిశే శ్రీకాంత్, పూండ్రు జైపాల్‌రెడ్డి, బోడకుంట్ల ప్రకాశ్, నాగేశ్వర్రావు, మంత రాజయ్య, గోలి రాజయ్య, రఘ, కట్టయ్య, రాజేందర్, మోతీలాల్, యుగేంధర్, ప్రమోద్ పాల్గొన్నా రు. సంగెం మండలంలో 2,576 మంది ఓటర్లు ఉండగా 2,026 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,361 మంది మహిళలు 665 మంది ఉన్నారు. 78.64శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
మామునూరు ఏసీపీ తిరుపతి పోలింగ్ సరళితో పాటు బందోబస్త్ నిర్వహిస్తున్న సిబ్బందికి సూచనలు చేశారు. తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ రవీందర్, ఎస్సై నరేశ్ పాల్గొన్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంగెంలో పోలింగ్ సరళిని పరిశీలించారు. బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడారు. నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సారంగపాణి, సంగెం సొసైటీ చైర్మన్ కుమారస్వామియాదవ్, సాగర్‌రెడ్డి, అనిల్, బాబు, కోడూరి సదయ్య, శరత్, నాగార్జునశర్మ, గోవర్ధన్‌గౌడ్, కె.మొగిలి, మన్సూర్ అలీ, యార బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.