కరీమాబాద్, జనవరి 29 : వందల ఏండ్లుగా ఉర్సు దర్గా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పీఠాధిపతులు నవీద్‌బాబా, ఉబేద్బాబా తెలిపారు. సోమవారం ఉర్సు దర్గాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 2 నుంచి 468వ ఉర్సు దర్గా (హజ్రత్ సయ్యద్ జలాలొద్దీన్ షా జమాలుల్ బహర్) ( సయ్యదనా మాషుక్ రబ్బానీ) ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. కాగా, ఉత్సవాలను భక్తులు విజయవంతం చేయాలని కోరారు.
ఫకీర్ల విన్యాసాలతో 2వ తేదీ రాత్రి ఉర్సు నయాఘడీలోని తన ఇంటి వద్ద నుంచి గంధాన్ని తీసుకువచ్చి పవిత్ర సమాధికి (గంధలేపనం) పూస్తామన్నారు. దీంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 3వ తేదీన ఉర్సు ఉత్సవాలు ప్రారంభమై 4న ముగియనున్నట్లు తెలిపారు. ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకుని సుప్రసిద్ధ ఇస్లామిక్ వేద పండితులతో ఆధ్యాత్మిక సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైలానీబాబా, చాంద్‌పాషా, మగ్దూం, గడ్డం యుగేంధర్ పాల్గొన్నారు.