హనుమకొండ చౌరస్తా, జనవరి 10: హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లోని ఇండోర్ స్టేడియంలో 34వ సీనియర్ నేషనల్ సెపక్తక్రా పోటీలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పోటీలను ప్రారంభించారు. ఈనెల 14 వరకు జరుగనున్న ఈ పోటీల్లో 28 రాష్ర్టాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు , 30 మంది టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్‌లో తలపడనున్నారు.
కార్యక్రమంలో సెపక్తక్రా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానుగంటి సురేశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రిక్కల శ్రీనివాస్‌రెడ్డి, చైర్మన్ లయన్ హనుమాండ్ల రెడ్డి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్, కోశాధికారి మైనం వికేశ్కుమార్, జిల్లా గ్రంథాలయ సం స్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్‌ఖాన్, బీజేపీ హనుమకొం డ, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రావు పద్మ, చందుపట్ల కీర్తిరెడ్డి, డీవైఎస్వో గుగులోత్ అశోక్‌కుమార్‌నాయక్, బ్యా డ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ రమేశ్‌రెడ్డి, సెపక్తక్రా అసోసియేషన్ ఉపాధ్యక్షులు బీ జగన్నాథ స్వామి, డీ శ్రీధర్, జీ సంజీవరెడ్డి,
కే అనిత, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్స్ ఎస్ఆర్ విజయరాజ్, పీ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీలు కునమల్ల జితేందర్నా థ్, గన్ను విజయభాస్కర్‌రెడ్డి, ఎండీ జరీఫుద్దీన్, పర్లపెల్లి శిరీష, అసోసియేట్ జాయింట్ సెక్రటరీలు డీ గోపాలకృష్ణ, జీ అయోధ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ కే శ్రీకాంత్, ఈసీ మెంబర్స్ ఆనంద్, బండి వెంకట్రాంరెడ్డి, కే అర్చ న, బీ భాస్కర్‌గౌడ్, కలకోట్ల భాస్కర్, రిక్కల వెంకటరామకృష్ణ, చామకూర బాగారెడ్డి, టీ యోగేశ్వరి, ఎన్ విజ యరేఖ, అసోసియేట్ ఈసీ మెంబర్స్ ఎస్ ఈశ్వర్కుమా ర్, డీ దినేశ్, ఎస్ కరుణాకర్, కే మల్లేశం పాల్గొన్నారు.
ఉమెన్స్ టీం ఈవెంట్లో: ఉత్తరప్రదేశ్‌పై ఎస్ఎస్బీ (3-0), అస్సాంపై బిహార్(1-2), తెలంగాణపై నాగాలాండ్(2-1), బిహార్‌పై ఎస్ఎస్బీ(3-0), హర్యానాపై మణిపూర్(0-3), హర్యానాపై నాగాలాండ్(1-2), తెలంగాణపై మణిపూర్(3-0) జట్టు గెలుపొందింది. మెన్స్ టీం ఈవెంట్లో: మహారాష్ట్రపై ఎస్ఎస్బీ(3-0), తెలంగాణపై ఢిల్లీ(3-0), తమిళనాడుపై అస్సాం(2-1), ఉత్తరప్రదేశ్‌పై మణిపూర్(3-0), తమిళనాడుపై ఎస్ఎస్బీ(3-0), అస్సాంపై మహారాష్ట్ర(1-2), తెలంగాణపై ఉత్తరప్రదేశ్(1-2), అస్సాంపై ఎస్ఎస్బీ(2-1), మహారాష్ట్రపై తమిళనాడు(2-1), తెలంగాణపై మణిపూర్(3-0), మణిపూర్‌పై ఢిల్లీ(2-1) జట్టు గెలుపొందింది.