ములుగు : మండలంలోని రొయ్యూరు సమీపంలో సోమవారం డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 27 పశువులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్ తెలిపారు. చర్ల సమీపంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో పశువులు కొనుగోలు చేసి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా డీసీఎంలో తరలిస్తున్నారని వారు పేర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున తాము వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో డీసీఎం చర్ల నుంచి వస్తుండగా తనిఖీ చేశామని చెప్పారు.
వీటిని హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందన పేర్కొన్నారు. ఈ మేరకు సదరు డ్రైవర్ పై కేసు నమోదు చేశామని పట్టుకున్న 27 పశువులను భూపాలపల్లి జిల్లా రాంపూర్ గోశాలకు తరలించినట్లు తెలిపారు. నిబంధన విరుద్ధంగా మూగజీవాలను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. తనిఖీల్లో పోలీసులు ఇబ్బంది పాల్గొన్నారు.