నల్లబెల్లి, జూలై 14 : ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్నా యత్నానికి పా ల్పడి చికిత్స పొందుతూ ఈ నెల 7న మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, సివిల్ ఎస్సై టీఎస్, ఏపీ వెల్ఫేర్ బృందం ఆదివారం మండలంలోని నారక్కపేట గ్రామం చేరుకుని మృతుడి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.
అనంతరం సొసైటీ అధ్యక్షుడు ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో మృతుడి భార్య కృష్ణవేణి కి రూ.25లక్షల ఆర్థికసాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2014 ఎస్సై బ్యాచ్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుం చి 747 మంది ఉన్నామని, అందులో సభ్యుడైన ఎస్సై శ్రీనివాస్ మృతి తీరని లోటు అని అన్నారు. అతడి కుటుంబానికి జీవితాంతం సొసైటీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చా రు. కార్యక్రమంలో ఎస్సైలు రామకృష్ణ, శ్రీనివాస్, రామారావు, పరమేశ్ పాల్గొన్నారు.