హనుమకొండ చౌరస్తా, జూలై 7 : కాకతీయ విశ్వవిద్యాలయం 23వ స్నాతకోత్సవ వేడుకలు సోమవారం సంబురంగా జరిగాయి. కేయూ ఆడి టోరియంలో నిర్వహించిన ఈ కార్య క్రమానికి యూనివర్సిటీ చాన్స్‌లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, సీఎస్ఐఆర్-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డీ శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యా రు. వీరితో కలిసి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచం ద్రం, పూర్వ ఉపకులపతు లు, కంట్రోలర్, డీన్లు, పాలకమండలి, సెనేట్ సభ్యులు ఫొటో దిగారు. బంగారు పతకాలు, పీహెచ్‌డీలు పొందే విద్యార్థుల్లో అధిక శాతం మంది తెల్ల దుస్తుల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా 446 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 374 మందికి డాక్టరేట్లు ప్రదానం చేశారు. అనంత రం గవర్నర్ మాట్లాడుతూ కేయూ స్నాతకోత్స వం విద్య, వికాసం, నూతన ఆరంభాలకు ప్రతీకగా నిలిచిందని, ఈ కార్యక్రమం విద్యా ర్థుల సంకల్పానికి గుర్తింపు అన్నారు. స్నాతకో త్సవం ముగింపు కాదని, ఒక ఆరంభమని, ఇది జీవితంలోని నూతన అధ్యాయానికి నాంది అన్నారు. విద్యార్థులు కేవలం డిగ్రీ పొందలేదని, ఒక బాధ్యతను, ఆశయాన్ని, దేశాభివృద్ధిలో భాగస్వామిగా మారే అవకాశా న్ని స్వీకరించారన్నారు. విద్యార్థుల విజయం వెనుక నిలిచిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ను అభినందించారు.
విద్యార్థులే రేపటి మార్గ దర్శకులు, ఆవిషర్తలు, సమస్య పరిషారకు లు, సంసర్తలు అవుతారన్నారు. విద్యార్థులు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా, జీవి తంలో, సమాజంలో కొత్త ఆలోచనలను ప్రవే శపెడుతూ ముందుకు సాగాలని పిలుపు నిచ్చా రు. కేయూ స్థాపించి 50 ఏళ్లు నిండాయని, ఉత్తర తెలంగాణలో ఉన్నత విద్యలో మార్గద ర్శిగా నిలిచిందన్నారు. 672 ఎకరాల విస్తీర్ణం లో విస్తరించిన కేయూ 7 అనుబంధ పీజీ కళాశాలలు, 27 విభాగాలు, 500కి పైగా డిగ్రీ అనుబంధ కళాశాలలతో విస్తృత పరిధి కలిగిన విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందిందన్నారు. 2023లో న్యాక్ ఏప్లస్ గ్రేడ్ సాధించిందని, ఫార్మా స్యూటికల్ సైన్సెస్ కాలేజీకి 84వ స్థానం దక్కగా జాతీయస్థాయి గుర్తింపు లభించిందని, గ్రీన్ మెట్రిక్స్‌లో దేశంలో 3వ స్థానం, తెలంగాణలో 1వ స్థానం సంపా దించిందన్నారు. ఈ పురోగతి వనరుల వల్ల కాదని, ఫ్యాకల్టీ, విద్యార్థులు, పరిశోధకు ల సంకల్పదీక్షతో సాధ్యమైందన్నారు. డీఎస్ టీ, ఐసీఏంఆర్, ఐసీఎస్ఎస్ఆర్, యూజీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ద్వారా నిధులు సమకూ రుతున్నాయని, ఇది విశ్వవిద్యాలయంలోని పరిశోధన నిబద్ధతకు నిదర్శనమన్నారు. విద్యా ర్థుల విజయం విశ్వవిద్యాలయ కీర్తిని ప్రతిబిం బించాలని, నైతిక విలువలు, సేవాభావంతో ముందుకు సాగితే అది యూనివర్సిటీకి నిజ మైన గౌరవమని జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
సమాజ నిర్మాణానికి విద్యా సంస్థలు విద్యార్థుల శక్తిని ఉపయోగించాలని, భాషా మాధ్య మం అభివృద్ధికి అవరోధం కాదని సీఎస్ఐ ఆ ర్-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డీ శ్రీనివాసరెడ్డి అ న్నారు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి, తెలు గు మీడియంలో విద్యనభ్యసించి, ఇంగ్లిష్తో పోరాడుతూ, పేపర్‌బాయ్‌గా పని చేసిన జీవిత ప్రయాణ అనుభవాలను వివరించారు. నూ తన ప్రపంచంలో జ్ఞానం సరిపోదని, సృజనా త్మకత, కమ్యూనికేషన్, సహకార సామర్థ్యం మానవ వనరులను దృఢంగా మార్చగలవన్నా రు. సిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజి టల్ ఇండియా, పీఎంకేవీవై, అటల్ ఇన్నోవేష న్ మిషన్ వంటి అవకాశాలను విద్యార్థులు వినియో గించుకో వాలని సూచించారు.
వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కేయూ ఎన్నో మైలురాళ్లు దా టిందని, ప్రభుత్వం రూ. 144 కోట్ల బ్లాక్ గ్రాంట్, రూ. 50 కోట్ల అదనపు గ్రాంట్ మంజూరు చేసిందన్నారు. దీని ద్వారా విశ్వవిద్యాలయం మౌలిక వసతులు బలోపేత మవుతాయన్నారు. పాలక మండలి సభ్యులు బీ సురే ష్లాల్, బీ రమ, ఎన్ సుదర్శన్, చిర్రా రాజు, సుకు మారి, ఎం నవీన్, కే అనితారెడ్డి, బాలు హాన్, పుల్లూరి సుధాకర్, పూర్వపు ఉప కులపతులు లింగమూర్తి, బీ వెంకటరత్నం, అకడమిక్ సెనేట్ సభ్యులు అంపశయ్య నవీన్, మాణిక్యం, గొల్లపూడి జగదీశ్, డీన్లు కట్ల రాజేందర్, హనుమంత్, శ్రీనివాస్, సదా నందం పాల్గొన్నారు. కాగా, గోల్డ్ మెడల్స్, పీహెచ్డీ పట్టాలు అందుకుంటున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు వీక్షించేందుకు ఆడిటోరి యం ఆవరణలో భారీ స్క్రీన్, కుర్చీలు ఏర్పా టు చేశారు. ఒక్కసారిగా వర్షం రావడంతో త డవకుండా కుర్చీలను అడ్డుగా పెట్టుకున్నారు.