డబుల్ సౌలత్

- రెడ్డిపాలెం, అక్కంపేట, ఆత్మకూరులో ఫోర్‌లేన్
- ముస్త్యాలపల్లిక్రాస్, రెడ్డిపాలెం వద్ద జంక్షన్లు
- ఎమ్మెల్యే చల్లా చొరవ.. మార్చిలోగా పనుల పూర్తికి ప్లాన్
- రూ.37 కోట్లతో ఏనుమాముల టు ఆత్మకూరు డబుల్ రోడ్డు నిర్మాణం
జిల్లా ప్రజలకు మరో అద్భుతమైన రోడ్డు అందుబాటులోకి రానుంది. వరంగల్ ఏనుమాముల నుంచి ఆత్మకూరు మండల కేంద్రం వరకు రూ.37 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం డబుల్ రోడ్డు నిర్మిస్తున్నది. ఈ రోడ్డు పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. మార్చి నెలాఖరులోగా దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇరవై కిమీ నిడివి గల ఏనుమాముల - ఆత్మకూరు రోడ్డులో రెడ్డిపాలెం, అక్కంపేట, ఆత్మకూరు గ్రామాల వద్ద ఫోర్‌లేన్ రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టం నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
- వరంగల్‌రూరల్, జనవరి 25 (నమస్తేతెలంగాణ)
వరంగల్- ఏటూరునాగారం 163 జాతీయ రహదారిలో ఆత్మకూరు ఉంది. ఈ హైవేలో ప్రయాణికులు ఆత్మకూరు నుంచి పెద్దాపూర్, అక్కంపేట గ్రామాల మీదుగా నేరుగా వరంగల్‌కు చేరుకునే రోడ్డును అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన కొన్ని దశబ్దాల నుంచి ఉంది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రహదారులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రతిపాదనకు రెండేళ్ల క్రితం ఆమోదముద్ర వేసింది. వరంగల్‌లోని ఏనుమాముల నుంచి గీసుగొండ మండలంలోని రెడ్డిపాలెం, మొగిలిచర్ల, దామెర మండలంలోని ముస్త్యాలపల్లిక్రాస్, ఆత్మకూరు మండలంలోని అక్కంపేట, లింగమడుగుపల్లి, పెద్దాపూర్, కామారం మీదుగా ఆత్మకూరు వరకు 20 కిమీ రోడ్డును విస్తరణ, అభివృద్ధికి రూ.37 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు ఆర్అండ్బీ అధికారులు రూ.37 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. టెండర్ దక్కించుకున్న గుత్తేదారు ఏడాదిన్నర క్రితం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. గతంలో ఈ బీటీ రోడ్డు 3.75 మీటర్ల వెడల్పుతో మాత్రమే ఉండేది. దీన్ని ఏడు మీటర్ల వెడల్పుతో డబుల్‌రోడ్డుగా నిర్మించే పనులు జరుగుతున్నాయి. మార్గమధ్యలోని కామారం గ్రామం వద్ద ఉన్న వాగుపై 30 మీటర్ల పొడవుతో బాక్స్ కల్వర్టు నిర్మించారు. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా గ్రావెల్ వర్కు, మెటల్ వేయడం, రోలింగ్ చేయడం వంటి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆత్మకూరు మండల కేంద్రంలో 1.20 కిమీ పొడవున బీటీకి బదులు సీసీ రోడ్డు వేశారు.
మూడుచోట్ల ఫోర్‌లేన్.. మార్చి నెలాఖరులోగా పూర్తి..
ఏనుమాముల- ఆత్మకూరు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు దాదాపు ఎనభై శాతం జరిగాయి. మార్చి నెలాఖరులోగా పనులను పూర్తి చేయాలనేది లక్ష్యం. మెటల్ పనులు పూర్తయ్యాయి. బీటీ వేయాల్సి ఉంది. ఆత్మకూరులో 1.20 కిమీ ఫోర్‌లేన్ పనులు కూడా పూర్తయ్యాయి. అక్కంపేట, రెడ్డిపాలెం వద్ద ఫోర్‌లేన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
- ఎండీ గౌస్, ఆర్అండ్బీ డీఈఈ
తాజావార్తలు
- ఇంధన ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ.. ఒంటి గంట వరకు వాయిదా
- పవర్ ఫుల్ ఉమెన్స్‌తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్
- భారత్‌కు ఎగువన బ్రహ్మపుత్రపై డ్యామ్స్.. చైనా గ్రీన్‌సిగ్నల్
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలి : ఎంపీ సోనాల్
- ఉమెన్స్ డే స్పెషల్: విరాట పర్వం నుండి అమెజింగ్ వీడియో
- మునగాలలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. మహిళ మృతి
- రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు: మహేష్
- వరుసగా మూడో రోజూ 18 వేల కరోనా కేసులు