శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Dec 24, 2020 , 00:31:49

పీవీ సంస్కరణలతోనే దేశం అభివృద్ధి

పీవీ సంస్కరణలతోనే దేశం అభివృద్ధి

ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, పెద్ది

వర్ధన్నపేట: దివంగత మాజీ భారత ప్రధాని పీవీ నర్సింహారావు ఆర్థిక రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతోనే భారతదేశం అ న్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్న దని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. పీవీ16వ వర్ధంతి సందర్భంగా హన్మ కొండలోని ఆయన స్వగృహంలో వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌తో కలిసి చిత్రటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బహుబాషా కోవిదుడైన పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలతోనే నేడు దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నదని వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ జక్కు ల వెంకటేశ్వర్లు, ‘కుడా’ అడ్వైజరీ కమిటీ సభ్యులు నన్నెబోయిన రమేశ్‌యాదవ్‌, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, మనీంద్రనాథ్‌ పాల్గొన్నారు. 

 నర్సంపేటరూరల్‌ : ఆర్థిక సంస్కరణల పితామహుడు  దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పీవీ జన్మస్థలమైన నర్సంపేట మండలం లక్నెపల్లిలో బుధవారం 16వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్ది హాజరై మాట్లాడారు. మారుమూల గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని కావడం గర్వించదగిన విషయమన్నారు. ప్రభుత్వం లక్నేపల్లి, వంగర గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని తెలిపారు. జాతీయ స్థాయిలో పాకాల, లక్నేపల్లికి గుర్తింపు లభించిందన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, లక్నేపల్లి, రామవరం గ్రామాల సర్పంచ్‌లు గొడిశాల రాంబాబు, కొడారి రవన్న, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, మాజీ ఎంపీటీసీ పరాచికపు శ్యాంసుందర్‌, ఉప సర్పంచ్‌ పరాచికపు సంతోష్‌, డాక్టర్‌ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షులు పాత్కాల కొమ్మాలు, జినుకల శంకర్‌, పిండి మొగిళి, పిండి నరేందర్‌, పీవీ మెమోరియల్‌ ట్రస్ట్‌ కార్యదర్శి మాడ్గుల రవీంద్రాశర్మ, దార దిలీప్‌, సంతోష్‌, కత్తి కిరణ్‌, మహేందర్‌రెడ్డి, రవీంద్రాచారి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


logo