మిన్స్క్: ఇటీవల గ్రీస్ నుంచి లుథివేనియా వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసి.. దాంట్లో ప్రయాణిస్తున్న బెలారస్ జర్నలిస్టు రోమన్ ప్రోటాసేవిచ్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 26 ఏళ్ల ప్రోటాసేవిచ్ బెలారస్ దేశ జాతీయ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. కన్నీటి పర్యంతమైన అతను ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపట్టినట్లు ఆ ఇంటర్వ్యూలో అంగీకరించాడు. అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోపై ప్రశంసలు కూడా కురిపించాడు. అయితే ప్రోటాసేవిచ్పై వత్తిడి తెచ్చి ఇంటర్వ్యూ ప్రసారం చేశారని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో నెక్స్టా ఛానల్‌ను నడిపిన ప్రోటాసేవిచ్.. అధ్యక్షుడు అలెగ్జాండర్ పాలనపై విమర్శలు చేశారు. దీంతో అతన్ని ఉగ్రవాద లిస్టులో చేర్చారు. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లు అలెగ్జాండర్ లుకషెంకో ప్రకటించుకున్నారు. ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు జర్నలిస్టు ప్రోటాసేవిచ్ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. దీంతో బెలారస్లో భారీ ఎత్తున్న ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రోటాసేవిచ్ను అరెస్టు చేయాల్సి వచ్చింది.