హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఆన్లైన్ తరగతులు వాయిదా పడ్డాయి. ఆన్లైన్ తరగతుల ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి విద్యార్థులకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని జలీల్ తెలిపారు. www.tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించారు.