శుక్రవారం 27 నవంబర్ 2020
Warangal-rural - Nov 10, 2020 , 02:01:51

త్రికూటాలయంలో పురావస్తు శాఖ అధికారులు..

త్రికూటాలయంలో పురావస్తు శాఖ అధికారులు..

ధర్మసాగర్‌: మండలంలోని ముప్పారం గ్రా మంలో ఉన్న త్రికూటాలయాన్ని సోమవారం పు రావస్తు శాఖ అధికారుల బృందం సందర్శించిం ది. జిల్లా పురావస్తు శాఖ అధికారి ఎం మల్లేశ్‌, సెం ట్రల్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌, ఆర్కియాల జిస్టు దేవేంద్రనాథ్‌ బోయి ఆలయాన్ని పరిశీలిం చారు. కాకతీయుల కాలంలో నిరించిన ఈ ఆల యం ఎదుట ఉన్న శాసనాన్ని కొలిచారు. లోప ల ఉన్న శిలా సంపదను పరిశీలించారు. ఆవరణ లో గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం జరిపి న తవ్వకాలను చూసి అసంతృప్తి వ్యక్తం చే శారు. ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకతను గురించి రాష్ట్రస్థాయి అధికారులు, ప్రభుత్వానికి తెలియ జేయనున్నట్లు వారు తెలిపారు.

దేవాలయం అభివృద్ధి కోసం తమ శాఖాపరంగా సహాయ సహ కారాలు అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. సర్వేయర్‌ ప్రశాంత్‌, కో-ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌, స ర్పంచ్‌ గొనెల సమ్మక్క, ఎంపీటీసీల ఫోరం మం డల అధ్యక్షుడు, ముప్పారం ఎంపీటీసీ పెద్ది శ్రీని వాస్‌, మాజీ సర్పంచ్‌ గడ్డం రాజయ్య, వీఆర్‌ఏలు ఎం సాంబరాజు, కుమారస్వామి, గ్రామస్తులు ఉన్నారు.