శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-rural - Nov 01, 2020 , 01:55:43

పట్టభద్రులందరినీ ఓటర్లుగా చేర్పించాలి: తహసీల్దార్‌

పట్టభద్రులందరినీ ఓటర్లుగా చేర్పించాలి: తహసీల్దార్‌

ఖానాపురం: పట్టభద్రులందరినీ ఓటర్లుగా చేర్పించాలని తహసీల్దార్‌ జూలూరి సుభాషిణి అన్నారు. శనివారం ఆమె ఓటరు నమోదుపై తహసిల్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. మండలంలో అర్హత కలిగిన పట్టభద్రులను గుర్తించే బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనర్సయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వేములపల్లి వెంకటప్రసాద్‌, బీజేపీ మండల బాధ్యుడు యాకస్వామి పాల్గొన్నారు.

‘పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలి’

పరకాల టౌన్‌/ఆత్మకూరు: పట్టభద్రులు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని పరకాల 1వ వార్డు కౌన్సిలర్‌ మడికొండ సంపత్‌కుమార్‌ అన్నారు. వార్డు పరిధిలో స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసిన అనంతరం వాటిని శనివారం తహసీల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో కో ఆప్షన్‌ సభ్యురాలు ముఫీనా ఫాతిమా హమీద్‌  పాల్గొన్నారు. అలాగే, ఆత్మకూరులో టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షుడు వేముల నవీన్‌, టీఆర్‌ఎస్వీ మండల నాయకుడు పెండేల భిక్షపతి దరఖాస్తు ఫారాలను తహసీల్దార్‌ విక్రమ్‌కుమార్‌కు అందజేశారు. ఈ నెల 6వ తేదీలోగా పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.