దిగులు పడొద్దు.. ఏం కాదు

వరంగల్ చౌరస్తా : ‘దిగులు పడొద్దు, ఎవరికీ ఏం కాని వ్వం” అని కరోనా బాధితులకు మంత్రి కేటీఆర్ అభయ మిచ్చారు. వరంగల్‌లో వరద పరిస్థితులను పరిశీలించేం దుకు వచ్చిన ఆయన, ఎంజీఎంలోని కొవిడ్-19 వార్డును సందర్శించారు. ఉదయం 11.56గంటలకు వైద్యశాలకు వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యు కేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ డా క్టర్ నాగార్జున్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం నేరుగా కొవిడ్-19 విభాగానికి చేరుకున్న మంత్రి కేటీఆర్, పూర్తి రక్షణ చర్యలు పాటిస్తూ, పీపీఈ కిట్లు ధరించి వార్డులోకి వెళ్లారు. ఆయనతో మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబె ల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, అర్బన్ జిల్లా కలెక్టర్ ఆర్జీ హన్మంతు ఉన్నారు. విభాగంలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ పేరుపే రునా పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసు కున్నారు. హైదరాబాద్‌కు చెందిన కరోనా బాధితుడు ల్యాబ్ టెక్నీషియన్ రాజమల్లుతో మాట్లాడి వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. మణిపూర్ నుంచి వచ్చిన ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌తో మాట్లాడి అందుతున్న డైట్‌పై ఆరా తీశారు. మరో బాధితుడిని పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పరిశీలించారు. పల్స్ ఆక్సీమీటర్ 96గా చూపించడంతో బాధితుడి వెన్నుతట్టి త్వరలో ఇంటికి వెళ్లిపోవచ్చని ధైర్యం నింపారు. బాధితుల్లో కొందరు మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. 45 నిమిషాలపాటు కొవి డ్ వార్డులోనే ఉండి బాధితులకు అభయమిచ్చారు. కొవిడ్ నోడల్ కేంద్రంగా ఉన్న ఎంజీఎంలో అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే ఎంజీఎంలో మరో 150 పడకలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని, కావాల్సిన అన్ని యంత్ర, పరికరాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కొవిడ్ సేవలను త్వరలో ప్రారం భించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొవిడ్ వార్డులోకి బంధువులను అనుమతించొద్దని అధికారులను ఆదేశించారు. ఇక్కడ మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, జీడబ్ల్యూఎంసీ క మిషనర్ పమేలా సత్పతి, డీఎంహెచ్‌వో లలితాదేవి, ఎం జీఎం వైద్యులు, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.
నాయకులు, వైద్యుల ఆశ్చర్యం
వరంగల్ పర్యటనలో భాగంగా ఎంజీఎం, కేఎంసీని మంత్రి కేటీఆర్ సందర్శించనున్నట్లు అధికారులు తెలియ జేయగా కొవిడ్ విభాగంలోకి ఆయన వెళ్లకపోవచ్చునని అంతా భావించారు. ఊహించని విధంగా మంత్రి కేటీఆర్ 45 నిమిషాల పాటు కొవిడ్ వార్డులోనే ఉండడం, రెండో అంతస్తులో బాధితుల వద్దకు వెళ్లి వారి బాగోగులు తెలు సుకొని ధైర్యం చెప్పడంతో అటు వైద్యులు, ఇటు నాయకులు ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడూ కొవిడ్ వార్డులను సందర్శించ లేదని మంత్రి కేటీఆర్ నేరుగా కొవిడ్ పాజిటివ్ వార్డులోకి వెళ్లి సుమారు గంటపాటు బాధితులతో గడపడంతో వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన బాధితులకు ధైర్యాన్ని నింపిన తీరుకు ఫిదా అయ్యామన్నారు.
తాజావార్తలు
- ఐటీ అభివృద్ధికి బ్లూప్రింట్
- క్షిపణి సాంకేతికతలో ఆత్మ నిర్భరత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- అవార్డుతెచ్చిన ‘అమ్మమ్మ’ ఆవిష్కరణ
- 20.41 కోట్లతో దివ్యాంగులకు ఉపకరణాలు
- వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల ఆదేశం
- ప్లాస్మా పొడితో ప్రతిరక్షకాలు
- 20 వేల ప్రైవేట్ వైద్యసిబ్బందికి టీకా
- ఏపీ ‘పంచాయతీ’కి సుప్రీం ఓకే
- సత్యలోకం కోసం బలి!
- 8 ఎకరాల్లో పీవీ విజ్ఞానవేదిక