– రామగుండం సీపీ శ్రీనివాస్
మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 25 : సామాజిక మాధ్యమాల్లో చ ట్టవ్యతిరేక పోస్టులు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసు కుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నా రు. గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ను పోలీసు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ట్విట్ట ర్, ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికగా కొందరు వివిధ రాజకీయ నేతలను టార్గెట్గా చేసుకుని, ఓ మతాన్ని లేదా మతానికి సంబంధించిన ప్రముఖుల్ని టార్గెట్గా చేసుకుని పోస్టులు పెడుతున్నారన్నారు. ఓ వర్గాన్ని కించ పరుస్తూ పోస్ట్ చేసినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో పుకార్లు ప్రచారం చేసినా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టులపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సీఐ ముత్తి లింగయ్య, ఎస్ఐ రాజమణి పాల్గొన్నారు.