గూడూరు, సెప్టెంబర్ 24 : మహబూబాబాద్ మీదుగా హైదరాబాద్‌కు రెండు వాహనాల్లో తరలిస్తున్న 187 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. మరొకరు పరారీలో ఉ న్నారని ఆయన పేర్కొన్నారు. గూడూరు పో లీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన వివరా లు వెల్లడించారు. మండలంలోని మచ్చర్ల గ్రామం వద్ద సోమవారం వాహనాలను త నిఖీ చేస్తుండగా మారుతి ఎర్టిగా, మహీం ద్రా ఎక్స్‌యూవీ కార్లలో గంజాయిని గుర్తించారు.
దీనిని తరలిస్తున్న ఒడిస్సా రాష్ర్టానికి చెందిన మండల నరేశ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాహుల్ ముజుందార్, హరీశ్ యాదవ్‌ను అదుపులోకి తీసుకోగా, ఒడిస్సాకు చెందిన మరో వ్యక్తి బాపన్ పరారయ్యాడని డీఎస్పీ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 46.76 లక్షలుంటుందన్నారు. గంజా యి పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ బాబూరావును డీఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలుంటాయని, గంజాయితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే శిక్ష తప్పదన్నారు. సమావేశంలో సీఐ బాబూరావు, గూడూరు, కొత్తగూడ ఎస్సైలు గిరిధర్‌రెడ్డి, కుశకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.