నెక్కొండ, జూలై 09 : గొర్రెల షెడ్డు పై 11 కేవీ విద్యుత్ తీగ తెగి పడడంతో 18 గొర్రెలు మృతి చెందగా మరికొన్ని గాయపడ్డాయి. ఈ విషాదకర సంఘటన నెక్కొండ మండలంలోని పెద్దకోర్పోల్ గ్రామంలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం..నూకల లక్ష్మికి చెందిన గొర్రెల షెడ్డుపై బుధవారం వేకువజామున 11 కేవీ విద్యుత్ తీగ తెగిపోయి గొర్రెల షెడ్డు పై పడింది. దీంతో షార్ట్ సర్క్యూట్ సంభవించి షెడ్డులోనితో 18 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో 20 గొర్రెలుఅస్వస్థతకు గురయ్యాయి. ఈ ప్రమాదంలో షెడ్ పూర్తిగా దగ్ధమైంది.
సుమారు నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు నూకల లక్ష్మి కోరారు. ఇండ్ల మీదుగా ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ ను తొలిగించి అక్కడ ఉన్న ట్రాన్స్ ఫార్మర్ తొలిగించాలని ఎన్నోసార్లు విద్యుత్ శాఖ అధికారులను కోరిన ఫలితం లేదని, విద్యుత్ శాఖఅధికారుల నిర్లక్ష్యం తోనే గొర్రెలు మృత్యువాత పడి ఆస్తి నష్టం సంభవించిందని గ్రామస్తులు ఆరోపించారు. సంబంధిత అధికారులు నష్టపరిహారం అందించి బాధిత ఉటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ మహేందర్, పశువైద్యాధికారులు సందర్శించారు.