చిల్పూరు, జూన్ 16 : టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా నిల్వ చేసిన 170 క్విటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారంతో శనివారం అర్ధరాత్రి జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం శివారులో తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వచేసిన 170 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. మండలంలోని రాజవరం గ్రామానికి చెందిన మోటం జంపయ్య, మోటం రాజశేఖర్ గ్రామ శివారులో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేశారు. వీరు గ్రామాల్లో పేదల ఇళ్లకు వెళ్లి కిలో రేషన్ బియ్యాన్ని రూ. 9 చొప్పున కొనుగోలు చేసి మహారాష్ట్రలో కిలో రూ. 26 వరకు విక్రయిస్తున్నారు. సీజ్ చేసిన బియ్యం విలువ రూ. 4.46 లక్షలుంటుందని అంచనా వేశారు. పట్టుకున్న బియ్యాన్ని స్టేషన్‌ఘన్‌పూర్ సివిల్ సైప్లె అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ముత్యం రాజేందర్, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, కానిస్టేబుల్ వీరన్న పాల్గొన్నారు.