వడ్ల కొనుగోళ్లు షురూ..
హనుమకొండ జిల్లాలో మొత్తం 164 ధాన్యం కొనుగోలు సెంటర్ల ను ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ధాన్యం తడువకుండా ఉండేందుకు టార్పలిన్లు, గన్నీ సంచు ల కొరత లేకుండా సంచులు, ధాన్యం రవాణా చేసేందుకు ఐదు సెక్టార్లుగా విభజించారు.
- హనుమకొండ జిల్లాలో 164 ధాన్యం సేకరణ కేంద్రాలు
- 2.50 లక్షల టన్నుల లక్ష్యం
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచన
- దశల వారీగా సెంటర్ల ఓపెనింగ్
- ప్రతి గింజా కొంటామని సర్కారు ప్రకటన
హనుమకొండ, ఏప్రిల్ 17 : హనుమకొండ జిల్లాలో మొత్తం 164 ధాన్యం కొనుగోలు సెంటర్ల ను ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ధాన్యం తడువకుండా ఉండేందుకు టార్పలిన్లు, గన్నీ సంచు ల కొరత లేకుండా సంచులు, ధాన్యం రవాణా చేసేందుకు ఐదు సెక్టార్లుగా విభజించారు. ము ఖ్యంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి వీలైనంత తొందరగా వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో స్థానిక ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. కాగా సోమవారం వేలేరు మండలంలో కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ప్రారంభించారు. నేడు కమలాపూర్, భీమదేవరప ల్లితో పాటు మిగిలిన ప్రాంతాల్లో ధాన్యం మార్కెట్‌కు వచ్చిన దాన్ని బట్టి ప్రారంభించనున్నారు. రైతులు మద్దతు ధర లభించాలంటే ప్రభుత్వ మార్గదర్శకాలను తూ.చ తప్పకుండా పాటించాలని, ఆరబెట్టిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ దిశలో రైతులకు సైతం అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లా లక్ష్యం 2.50 లక్షల టన్నులు..
యాసంగిలో జిల్లాలో49,720 హెక్టార్లు వరి సాగైంది. దీని ద్వారా 2,85,000 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అధికారులు అంచనా వేశారు. ఇందులో నుంచి సివిల్ సప్లయి అధికా రులు 2.50లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించారు. ఇందుకుగాను జిల్లాలో 164 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో పీఏసీఎస్ 109, ఐకేపీ 55 కొనుగోలు కేంద్రాలున్నాయి. కాగా మిగిలిన ధాన్యాన్ని మిల్లర్లు, స్థానిక అవసరాలు, విత్తనాల కోసం సేకరిస్తామని అధికారులు చెప్పారు. కాగా, గత యాసంగి సీజన్లో 1.20 లక్షల టన్నులు లక్ష్యం కాగా 24, 672 మంది రైతుల నుంచి 1,09, 998 టన్నులు, ఖరీఫ్‌లో 28,179 మంది రైతుల నుంచి 1,24,845 టన్నులు కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లయి అధికారులు తెలిపారు. మద్దతు ధర క్వింటాల్ ధాన్యం గ్రేడ్-ఎకు రూ. 2060, కామన్ రకం క్వింటాల్‌కు రూ. 2040 నిర్ణ యించారు.
రవాణాకు ఐదు సెక్టార్లు..
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రవాణా చేసేందుకు ధర్మసాగర్, భీమదేవరపల్లి, కమలాపూర్, హసన్‌పర్తి, శాయంపేటతో ఐదు సెక్టార్లు విభజించారు. ధర్మసాగర్ సెక్టార్లో ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి సెక్టార్లో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపుర్ సెక్టార్లో కమలాపూర్, పరకాల, నడికూడ మండలాలను చేర్చారు. అదే విధంగా హసన్‌పర్తి సెక్టార్లో హసన్‌పర్తి, కాజీపేట, ఐనవోలు, హనుమకొండ శాయంపేట సెక్టార్లో శాయంపేట, ఆత్మకూరు, దామెర మండలాలను చేర్చారు.
నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి..
ధాన్యాన్ని 17 శాతంలోపే తేమ ఉండేలా రైతులు చూసుకోవాలి. చెత్త, తాలు, మట్టిపెళ్లలు, రాళ్లు 1 శాతం మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన, పురుగుతిన్న, పూర్తిగా తయారుకాని, ముడుచుకున్న ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకు రాకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన మద్దతు ధర పొందాలంటే నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని అధికారులని అంటున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
– మహేందర్, సివిల్ సప్లయి డీఎం, హనుమకొండ జిల్లా
యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాం. రైతులకు ఇబ్బందు లు రాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించి కొనుగోలు కేంద్రాలకు ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకరావాలి. పూర్తిగా ఆన్లైన్ ఓపీఎంఎస్ విధానం ద్వారానే ప్రక్రియ జరుగుతుంది. రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదైన 48గంటల్లో రైతుల ఖాతాల్లో వెంట వెంటనే డబ్బులు జమ చేసేందుకు చర్యలు తీసుకున్నాం.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

