చిన్నగూడూరు, సెప్టెంబర్ 27 : కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకొని ఒకరిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. మరిపెడ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. మరిపెడ శివారు గాలివారిగూడెం స్టేజీ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మరిపెడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారును పరిశీలించగా అందులో రూ.31.75 లక్షల విలువ చేసే 127 కిలోల ఎండు గంజాయి లభించింది.
దీంతో గంజాయిని తరలిస్తున్న సోడి నాగేశ్వర్‌ను అదుపులోకి తీసుకొని కారును స్వాధీ నం చేసుకున్నారు. నిందితుడిని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా, కుంటా మండలం అసీగూడెంకు చెందిన రెవెన్యూ ఉద్యోగిగా గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు. పెద్ద మొత్తం లో గంజాయి పట్టుకున్న పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నిషేధిత వస్తువులు విక్రయించినా, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో సీఐ రాజ్‌కుమార్ గౌడ్, ఎస్సైలు సతీశ్ గౌడ్, సంతోష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.