సంగెం, సెప్టెంబర్ 2: బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి సాధ్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎల్గూర్‌రంగంపేటలో ఎల్గూర్‌స్టేషన్, బిక్కోజీనాయక్తండా, సంగెంలోని కుంటపల్లి, గాంధీనగర్, కొత్తగూడెం గ్రామాలకు చెందిన రైతులకు శనివారం ఆయన పంట నష్టపరిహారం చెక్కుల పంపిణీ చేశారు. అలాగే, ఎల్గూర్‌రంగంపేటలో జీపీ భవనం, హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులకు చల్లా శంకుస్థాపన చేశారు. అనంతరం 1200 మంది రైతులకు రూ. 1,29,19,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. తర్వాత జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై విపక్ష నేతలు విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు కన్నీళ్లే మిగిలాయన్నారు. బీఆర్ఎస్తోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ ప్రజలకు మంచి చేస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుపడడమే కాకుండా దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేసేసరికి కాంగ్రేసోళ్లకు మింగుడు పడడం లేదని ఎద్దేవా చేశారు. పది కాలాలపాటు సీఎంగా కేసీఆర్ ఉంటేనే సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయన్నారు. కార్యక్రమంలో నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, కందకట్ల నరహరి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, ఏవో యాకయ్య, సర్పంచ్‌లు పోతుల ప్రభాకర్, గుండేటి బాబు, వెంకటయ్య, ఎంపీటీసీ బానోత్ పద్మా శ్రీనివాస్, మెట్టుపెల్లి మల్లయ్య, పీఆర్డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ రమేశ్, సంగెం పీహెచ్సీ వైద్యాధికారి పొగాకుల అశోక్‌కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసునూరి సారంగపాణి, బీఆర్ఎస్ నాయకులు శాబోత్ శ్రీనివాస్, పసునూటి అశోక్‌కుమార్, వడ్లకొండ శ్రవణ్, రమేశ్‌బాబు, సుమన్, పొశాల రమేశ్, దళితబంధు మండల కోఆర్డినేటర్ బొమ్మాల శంకర్, దొనికెల శ్రీనివాస్, పెంతల అనిల్‌కుమార్, ఏఈవోలు సాగర్, సునీత, అఖిల్ పాల్గొన్నారు.
చల్లా సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు
ఆత్మకూరు: హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో ఆత్మకూరు, అగ్రంపహాడ్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు. ఆత్మకూరు నుంచి సంగె మహేందర్, తనుగల రఘు, భయ్య జగన్, అడప సాయికుమార్, జన్ను అనిల్, భయ్య రాజ్‌కుమార్, గుండెబోయిన సంజయ్, వీర్ల సిద్ధార్థ, గుండెబోయిన సాయితోపాటు మరో 30 మంది ఉన్నారు. అగ్రంపహాడ్ నుంచి కొమురయ్య, సూరయ్య, మదాసి ప్రసాద్, రాజు, కమల్, మేడిపల్లి కమలాకర్, రాజు దినేశ్, మదాసి మహిపాల్, కార్తీక్, రాజశేఖర్, రాకేశ్, విజయ్, మేడిపల్లి పరమేశ్, మదాసి సురేశ్, మేడిపల్లి మున్నా, అజయ్, పవన్, రాజు నరేశ్‌తోపాటు మరో 50 మంది ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, ఎంపీపీ మార్క సుమలతా రజినీకర్, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ వంగాల స్వాతీ భగవన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, అంబాటి రాజస్వామి, ఆత్మకూరు టౌన్ అధ్యక్షుడు పాపని రవీందర్, నాయకులు అంకూస్, పూజరి రాము, జిన్నా రామకృష్ణారెడ్డి, ఆనందం, బాషబోయిన సాగర్, రాజు, పెరుమాండ్ల భిక్షపతి, కరివేద మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ నాయకుడు తనుగుల రఘు మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితోనే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్కు లక్ష మెజార్టీ అందిస్తామన్నారు.
బీఆర్ఎస్కు హ్యాట్రిక్ ఖాయం
నడికూడ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 100 మందికి పైగా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసి ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామన్నారు. పార్టీ సభ్యత్వం పొందిన వారిలో ఎవరైన మృతి చెందితే వారి కుటుంబానికి ఇన్సూరెన్స్ ద్వారా రూ. 2 లక్షలు అందజేస్తున్నట్లు వివరించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో బీజేపీ యూత్ అధ్యక్షుడు ఏడాకుల కృష్ణమూర్తి, పెండ్లి రఘుపతి, తిరుపతి, గోరంటాల రాకేశ్, కుస నవీన్, సింగిరెడ్డి వంశీ, పెండ్లి నందు, యాత్ర ప్రతాప్, మేడిద విష్ణు, పి.వంశీ, ప్రవీణ్, రాజు, మహిపాల్, రాజమల్లు, రమణయ్య, పి.తిరుపతి ఉన్నారు.