నమస్తే నెట్వర్క్, మార్చి 20 : పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 245 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 42,468 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనుండగా, ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే వారిని మాత్రమే పరీక్ష కేంద్రాల్లో కి అనుమతిస్తారు.
ఆ తర్వాత వస్తే లోపలికి రానివ్వరు. హనుమకొండ జిల్లాలో 67 కేంద్రా లు.. 12,061 విద్యార్థులు, జయశంకర్ భూ పాలపల్లిలో 21.. 3,449, జనగామలో 41.. 6,238, మహబూబాబాద్‌లో 46.. 8,194, వరంగల్‌లో 49.. 9,392, ములుగులో 21.. 3134 మంది పరీక్షలకు హాజరుకా నున్నారు. పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. కాగా, ప్రభుత్వం పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇప్పటి వరకు ఉన్న గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికింది. గతంలో అంతర్గత పరీక్షలకు 20, వార్షిక పరీక్షలకు 80 మార్కులు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్కో సబ్జెక్టు 100 మార్కులకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి. ఈ ఏడాది మొదటిసారిగా 24 పేజీల బుక్లెట్ అందజేస్తున్నారు. అడిషనల్స్ ఉండవు. సమాధానాలు మొత్తం అందులోనే రాయాలి. విద్యార్థులు ముందుగా తమకు బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయాలని నిపుణులు చెబుతున్నారు.