Harish Rao | పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పష్టం చేశారు. వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులను కలవకుండా మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితలను, బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ సర్కార్ అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించింది.
ఈ క్రమంలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ.. రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకొని ఇక్కడికి రావాలి.. ఈ విద్యార్థులతో మాట్లాడండి.. ఆనాడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందో ఒక్కసారి రివ్యూ చేయాలని కోరుతున్నాం. లేదంటే వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఢిల్లీకి కదం తొక్కుతరు.. ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తారని హెచ్చరించారు.
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలున్నాయి.. ఎన్ని రోజులు ఆపుతవ్.. అటు పిల్లలను అన్నం పెట్టకుండా గోస పెడుతున్నవ్. ఇయ్యాళ్ల మమ్మల్ని గోస పెడుతున్నవ్.. నువ్వు.. ఏందీ అరెస్టులు.. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కుండదా..? అని అడిగారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నవ్. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెడుతున్నవ్.. ఏదో ఒక రోజు దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ప్రజలు తిరుగబడ్తరు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నామన్నారు.
స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్‌ను కలపడానికి మళ్లీ రేవంత్ రెడ్డి కమిటీ వేశాడు. అన్నిటికీ మీ గురువుగారే ఆదర్శం అంటావు కాదా.. అలాంటి ఏపీలోనే పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో కలపటం పొరపాటు అయిందని వెనక్కి తగ్గారు. ఢిల్లీలో కూడా ఇది ఫెయిల్ అయి.. వాళ్లు కూడా వెనక్కి తీసుకున్నారు. అందుకే రేవంత్ రెడ్డి కూడా వెంటనే వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఇవాళ కేవలం వరంగల్ పాలిటెక్నిక్‌లోనే 10 మంది విద్యార్థులు టీసీ తీసుకున్నారు. ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని మా పిల్లల జీవితాలు ఆగమైతున్నయ్.. మా పిల్లలు పాలిటెక్నిక్ చదివితే ఎటూ కాకుండా అయిపోతరని ఒక్క వరంగల్ పాలిటెక్నిక్‌లో 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి టీసీలు తీసుకొని, పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి.. వెంటనే GO 97 రద్దు చేసి యథావిధిగా ప్రభుత్వంలోనే నడపాలని డిమాండ్ చేస్తున్నాము.
LIVE: హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish https://t.co/gV4YIzlsdD
— BRS Party (@BRSparty) August 27, 2026
Donald Trump | ఆయన బతికే ఉన్నా తీవ్ర గాయాలతో ఉన్నారు : డొనాల్డ్ ట్రంప్
Shoaib Akhtar | క్రికెట్ కోసం బాలీవుడ్ చాన్స్ వదులుకున్నా : షోయబ్ అక్తర్
Akhilesh Yadav | అంకిత్ బలియాన్ హత్య జాట్ సామాజిక వర్గంపై జరిగిన దాడి: అఖిలేష్ యాదవ్