వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలం రామచంద్రాపురం గ్రామంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు.
పర్యటనలో భాగంగా రూ.1కోటి 69 లక్షలతో గ్రామంలో అంతర్గత సిమెంటు రోడ్లు, సైడు కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన, నూతనంగా రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె ప్రకృతివనం, వైకుంఠధామంలను ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో గ్రామ ప్రథమ సర్పంచ్ కీ.శే. బొంపెల్లి లక్ష్మీకాంతారావు స్మారకార్ధం వారి కుమారుడు – కోడలు(ప్రస్తుత సర్పంచ్) బొంపెల్లి దిలీప్ రావు – జయశ్రీ వైకుంఠ రథాన్ని గ్రామానికి బహుకరించారు.