మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓసీపీ లక్ష్యసాధనవైపు అడుగులు వేస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు, కార్మికులు సమష్టిగా ప్రయత్నిస్తున్నారు. నెలనెలా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. వర్షాల కారణంగా కొంత ఆటంకం ఏర్పడినా, వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓబీ పనులను కూడా నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా నిర్వహిస్తున్నారు.
– రామకృష్ణాపూర్, అక్టోబర్ 17
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓసీపీలో 2022- 23 వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు, కార్మి కులు సమష్టిగా కృషి చేస్తున్నారు. ఏప్రిల్ నుం చి సెప్టెంబర్ వరకు ఓసీపీలో వారు సాధించి న ఉత్పత్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ నెల టార్గెట్ లక్షా 60 వేల మెట్రిక్ టన్నులు కాగా, లక్షా 40 వేల 243 మెట్రిక్ టన్నుల ఉ త్పత్తి సాధించారు. మే నెలలో లక్షా 60 వేలు కాగా, లక్షా 75 వేల మెట్రిక్ టన్నులు, జూన్ లో లక్షా 60 వేల మెట్రిక్ టన్నులకు లక్షా 76 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేశారు. జూలై నె లలో 150 వేల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా నిర్ణయించగా, కుండపోత వర్షాల కారణంగా 65 వేల మెట్రిక్ టన్నులు సాధించారు. ఆ గస్టులో లక్షా 50వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి 66 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించారు. సెప్టెంబర్లో లక్షా 50వేల టన్నులకు గాను 93 వేల మెట్రిక్ టన్నులు సాధించారు. అదే విధంగా ఓబీ 101 లక్షల క్యూబిక్ మీ టర్ల లక్ష్యం కాగా, 73 లక్షల 59వేల క్యూబిక్ మీటర్లు వెలికితీశారు. వర్షాల కారణంగా కొం త మేర బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కల్గింది. ఓసీపీ అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగుల సమన్వయంతో ముందుకెళ్లి వార్షిక ఉ త్పత్తి లక్ష్యాన్ని అధిగమిస్తామని గని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు సమష్టి కృషితో లక్ష్య సాధనకు కృషి చేస్తున్నాం. అందరం కలిసి సాగితేనే ఆర్కేపీ ఓసీపీకి మరో 10 పదేళ్ల భవిష్యత్ ఉంటుంది. దీని కోసం హెచ్ఈఎంఎం (హెవీ ఎర్త్ మూవింగ్ మిషన్) అత్యధిక పని గంటలు వినియోగించాలి. దీనికి అన్ని కార్మిక సంఘాల సహకారం అవసరం. ఓసీపీ జీవిత కాలం పదేళ్ల పెంపు కోసం సర్వే పనులు పూర్తయి, నివేదిక సిద్ధమైంది. సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించి ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్కేపీ ఓసీపీ జీవిత కాలం ఇంకా రెండున్నరేండ్లు ఉంది.
-చింతల శ్రీనివాస్, జీఎం
రామకృష్ణాపూర్ ఓసీపీకి యాజ మాన్యం నిర్దేశిం చిన లక్ష్యం సా ధించేందుకు ప్ర తి ఉద్యోగి కృషే ముఖ్యం. ఈ వార్షిక సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు గతంలో ఎప్పుడూ లేని వర్షాలు కురిశాయి. గత పదేళ్లలో 1200 మి.మీ వర్షపాతం మించలేదు. ఈ వర్షాకాలం 1930 మి.మీ వ ర్షపాతం పడ్డది. దీనితో కొంత మేర ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వా ర్షిక లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి యంత్రా న్ని సాధ్యమైనంత మేర ఉపయోగించుకో వాలి. అధికారులతో పాటు కార్మికులు సమష్టిగా ముందుకెళ్తేనే వార్షిక లక్ష్యాన్ని చేరుకునే వీలుంటుంది. ఇందులో భాగంగా రక్షణ సూత్రాలు పాటించడం కూడా ముఖ్య మే. కార్మికులకు ఇదే అవగాహన కల్పిస్తు న్నాం. లక్ష్యాన్ని చేరుకు నేందుకు కార్మిక సం ఘాల సహకారం కూడా అవసరం.
-సీహెచ్ వెంకటేశ్వర్లు, గని మేనేజర్