నమస్తే తెలంగాణ నెట్వర్క్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో సోమవారం జరిగిన దళిత బంధు సభకు నగరం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ నుంచి ఖిలావరంగల్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ సోల్తీ భూమాత ఆధ్వర్యంలో రెండు బస్సుల ద్వారా దళిత సంఘాల నాయకులు వెళ్లారు. కార్యక్రమంలో బొల్లికుంట పార్టీ అధ్యక్షుడు ఎస్ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, 41వ డివిజన్‌కు చెందిన నాయకులు ఉర్సు నుంచి బయలుదేరారు. ఈదుల రమేశ్, కలకోట్ల రమేష్, ఈదుల భిక్షపతి పాల్గొన్నారు. అలాగే, 43వ డివిజన్ కార్పొరేటర్ ఈదురు అరుణ ఆధ్వర్యంలో మామునూరు నుంచి టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. 51వ డివిజన్ కార్పొరేటర్ బోయిపల్లి రంజిత్‌రావు హౌసింగ్‌బోర్డు కాలనీ వద్ద బస్సును జెండా ఊపి ప్రారంభించారు. గంగాధర రాజు, సమ్మయ్య, శ్రవణ్, విజయకుమార్, సంధ్యారాణి, లలిత తరలి వెళ్లారు. ఆరో డివిజన్ కార్పొరేటర్ చెన్నం మధు ఆధ్వర్యంలో డివిజన్ నుంచి ప్రజలు సభకు తరలివెళ్లారు. అలాగే, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆదేశాల మేరకు 31వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సభకు తరలివెళ్లారు. ఒకటో డివిజన్లోని పలివేల్పుల, ఎర్రగట్టుగుట్ట, ముచ్చర్ల గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు సభకు తరలివెళ్లారు.
పలివేల్పులలో బస్సును డివిజన్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. వెళ్లిన వారిలో దేవరకొండ శంకర్, మట్టెడ పౌల్, చిర్ర వీరస్వామి, పులెంట్ల శ్రీధర్, తోట నాగరాజు, పెద్దబోయిన నాగరాజు యాదవ్, అంకూస్ బాబు, చిర్ర సుమన్, అనిల్, సదానందం, కిరణ్, శ్రీనివాస్, రమేశ్, రాజా కొమురయ్య, కరుణాకర్ ఉన్నారు. అలాగే, కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ నుంచి టీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర, నాయకులు అరూరి రమేశ్, లంక రాజ్‌గోపాల్, పరశురాములు, కలకోట్ల సుమన్, గొల్లపల్లి వీరస్వామి, పసునూరి టోనీ, కందికొండ తిరుపతి, బందెల రాజేశ్‌ఖన్నా, దగ్గుల వినోద్ రోహిత తరలివెళ్లారు. టీఆర్ఎస్ 14వ డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహ ఆధ్వర్యంలో పలువురు నాయకులు సభకు తరలివెళ్లగా కార్పొరేటర్ తూర్పాటి సులోచన, మాజీ జడ్పీటీసీ తూర్పాటి సారయ్య జెండా ఊపి ప్రారంభించారు. గ్రేటర్ 55,65, 66 డివిజన్లలోని వివిధ గ్రామాల నాయకులు కార్పొరేటర్లు జక్కుల రజితా వెంకటేశ్వర్లు, గుగులోత్ దివ్యారాణి రాజునాయక్, టీఆర్ఎస్ 66 డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, మార్కెట్ డైరెక్టర్ చకిలం రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో సభకు వెళ్లారు.
అలాగే, ధర్మసాగర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు హన్మకొండలోని ఎమ్మెల్యే రాజయ్య గృహం వద్దకు చేరుకుని, అక్కడి నుంచి ర్యాలీగా ఎమ్మెల్యేతో కలసి సభకు వెళ్లారు. జడ్పీటీసీ పిట్టల శ్రీలత, పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాదకుమార్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కర్ర సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ రఘు, పిట్టల సత్యనారాయణ, జోజి, మంద ఆరోగ్యం, రమేశ్, మాజీ సర్పంచ్ గొట్టం రవయ్య, సిక రవి, బాలస్వామి, సోమయ్య, రమణకర్, కుమార్ పాల్గొన్నారు. ఐనవోలు మండల కేంద్రంలో ఎంపీపీ మార్నేని మధుమతి, వైస్ ఎంపీపీ తంపుల మోహన్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్ మునిగాల సంపత్‌కుమార్, సర్పంచ్ జన్ను కుమారస్వామి, ఎంపీటీసీ కొత్తూరి కల్పనా మధుకర్, నాయకులు అశోక్, బాబు, మహేందర్, కుమారస్వామి, పరమేశ్, రాజశేఖర్, వెంకటనారాయణ, రమేశ్, సమ్మయ్య, రాజయ్య, వెంకట్‌రెడ్డి, ప్రతాప్, సత్యం, లవన్ తదిరులు తరలివెళ్లారు.