అప్పుడు చార్జీలు పెంచే అవసరముండదు
పలు పార్టీల నాయకులు, రైతుల అభిప్రాయం
విద్యుత్ అధికారులపై ఫిర్యాదులు
అంతర్గత సామర్థ్యం పెంచుకోవడానికే డెవలప్మెంట్ చార్జీలు: సీఎండీ
రైతులను దూషిస్తే వదిలిపెట్టేది లేదు
ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు
హనుమకొండ సిటీ, ఫిబ్రవరి21: విద్యుత్ శాఖలో అనవసరమైన ఖర్చును తగ్గించుకుంటే వినియోగదారులపై భారం మోపే అవసరం ఉండ దని పలు పార్టీల నాయకులతోపాటు రైతులు అభి ప్రాయపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపుపై సోమవా రం హనుమకొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మ న్ శ్రీ రంగారావు బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. కరీంనగర్ జిల్లా నుంచి హాజరైన రైతు సంఘం నాయకుడు సంప త్రావు మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలు జరు గకుండా ముందే అవగాహన కల్పించినట్లయితే వారికి చెల్లించే నష్టపరిహారం నుంచి విద్యుత్‌శాఖ బయటపడొచ్చన్నారు. సీజీఆర్ఎఫ్ పేరుకు మాత్ర మే ఉందని, వినియోగదారులకు ఒరిగిదేమీ లేద న్నారు. లోక్ అదాలత్ నిర్వహించే సమయంలో ఎలాంటి పేపర్ ప్రకటనలు లేకుండా ఆగమేఘాల మీద నిర్వహించి మమ అనిపించుకుంటున్నా రన్నారు. జగిత్యాల జిల్లా నుంచి హాజరైన రైతు సంఘం నాయకుడు శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి ఎస్ఈపై క్రిమినల్ కేసు నమోదు చేసి విధుల్లో నుంచి తొలగించాలన్నారు. రైతుల పట్ల విద్యుత్ అధికారులు దౌర్జన్యంగా వ్యవహరిస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వ ర్యంలో సీపీఎం నాయకులు చుక్కయ్య, వాసు దేవరెడ్డి, మల్లారెడ్డితో పాటు ప్రజావేదిక కన్వీనర్ తిరుణహరి శేషు విద్యుత్ చార్జీల పెంపును ఉప సంహరించుకోవాలని ఈఆర్సీ చైర్మన్‌కు వినతి పత్రం అందజేశారు.
ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపా ల్రావు స్పందిస్తూ అంతర్గత సామర్థ్యాన్ని పెంచు కోవడానికే డెవలప్మెంట్ చార్జీలు పెంచామని, ఏమైనా సందేహాలు ఉండే స్థానిక ఏఈని సంప్ర దించాలన్నారు. కంపెనీ అభివృద్ధి జరుగాలంటే కొన్ని మార్పులు చేయక తప్పదన్నారు. ఎల్టీ-4 వినియోగదారులకు ఎప్పటిలాగే ఉచిత విద్యు త్ సరఫరాను పొడిగించినట్లు తెలిపారు. రైతు సంఘం నాయకులు అధికారులపై చేసిన ఆరోప ణలకు స్పందించిన ఈఆర్సీ చైర్మన్ వినియోగ దారులు, రైతుల పట్ల మర్యాదగా వ్యహరించాల ని, లేదని దౌర్జన్యం చేస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు క్రిష్ణయ్య, మనోహర్‌రాజు, కంపెనీ డైరెక్టర్స్, ఎస్ఈలు, డీఈలు, వివిధ జిల్లా లకు సంబంధించిన వినియోగదారులు పాల్గొన్నారు.