కాజీపేట, నవంబర్5: క్రూ డిపోను కాజీపేట రైల్వే జంక్ష న్లోనే కొనసాగించాలని, విజయవాడకు తరలింపును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని రైల్వే క్రూ లింకు లను విజయవాడకు తరలింపుపై స్థానిక క్రూ కంట్రోల్ ల్యాబీ కార్యాలయం ఎదుట శుక్రవారం తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జాక్ ఆధ్వ్యర్యంలో కన్వీనర్ దేవులపల్లి రాఘ వేందర్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభు త్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీలు పసు నూరి దయాకర్, డాక్టర్ బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రా జేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా పోరా డుతున్నా కేంద్రంలోని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేద న్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏ ర్పాటు చేశారని, త్వరలోనే బోడో ల్యాండ్‌లో ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని పట్టించుకోవడం లేదని విమ ర్శించారు.
దేశంలోని రైళ్లను ప్రైవేట్‌పరం చేయడం ప్రమాద కరమని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అంబానీ, అదానీ, టాటా రైళ్లను చూడాల్సిన దుస్థితి ఏర్ప డుతుందని ఆయన వ్యాఖ్యానించారు. సామాన్య ప్రజలకు రైలు ప్రయాణం అత్యంత ఖరీదుగా మారేందుకు కేంద్రం, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే వ్యాగన్ పీవోహెచ్ పనుల నిర్మాణానికి త్వరలోనే రైల్వేశాఖ టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. అంతకుముందు పలువురు వక్త లు మాట్లాడుతూ కాజీపేట క్రూ ల్యాబీ నుంచి లింకులను తరలింపు రైలు డ్రైవర్ల సమస్య కాదని, ప్రాంత సమస్యగా అభివర్ణించారు. ఈ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు రైలు డ్రైవర్లకు అండగా ఉంటాయని, అధైర్య పడాల్సిన అవ సరం లేదన్నారు. సీమాంధ్ర పాలకులు, అధికారులు కాజీ పేట రైల్వే జంక్షన్‌ను నిర్వీర్యం చేసేందుకు నిరంతరం కుట్ర లు పన్నుతున్నారన్నారు. దేశ ఆర్థిక సంపదను పెంచేందుకు కేంద్రప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరణ చేయడం బాధాకర మన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాజీపేట రైల్వే జంక్షన్‌కు డివిజన్ స్థాయి గుర్తింపు, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ను పొందుపరిచారని, వాటిపై కేంద్రం ఏమీ తేల్చడం లేద న్నారు. లింకుల తరలింపు సమస్య జఠిలం కాకముందే రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి నిలిపివేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కయ్య, స్థానిక కార్పొరేటర్లు జక్కుల రవీందర్యాద వ్, సయ్యద్ విజయశ్రీరజాలీ, సంకు నర్సింగరావు, రైల్వే జేఏసీ , మజ్దూర్, సంఘ్, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్, రిటైర్డ్ రైల్వే, ఓబీసీ, ఏఎల్ఆర్ఎస్ఏ నేతలు, కొండ్ర నర్సింగరా వు, శ్రీనివాస్, వేద ప్రకాశ్, చింత మురళి, వెంకటనారాయ ణ, రేణా రమేశ్, వీరన్న, ఎంఎన్ నారాయణ, ఏవీఎస్ఎ న్ మూర్తి, అనిల్, పాక ఓంప్రకాశ్తోపాటు రైల్వే ఎల్పీ, ఏ ఎల్పీలు, గార్డులు, రైల్వే కార్మికులు తదితరులు పాల్గొన్నారు.