కాశీబుగ్గ, జూన్ 14: పరిసరాల పరిశుభ్రతే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ నగరంలోని 3వ డివిజన్ పరిధి పైడిపల్లిలో మంగళవారం నిర్వహించిన పట్టణ క్షపగతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి పల్లె, పట్టణం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మరో మూడు అదనపు గదులు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల మైదానం లెవలింగ్‌కు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే వంట గది నిర్మాణానికి భూమి పూజ చేశారు. ముగ్గురు లబ్ధిదారులకు రూ.లక్షా 22వేల 500 విలువైన సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాకుమార్ యాదవ్, కార్పొరేటర్ జన్ను షీబారాణీ అనిల్, హనుమకొండ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, మాజీ కార్పొరేటర్ వీర బిక్షపతి, డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, మహిళా అధ్యక్షురాలు ఈట్యాల శిరీషా సతీశ్, పండుగ రవీందర్‌రెడ్డి, కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
వర్ధన్నపేట: మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంగళవారం వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో పట్టణ ప్రగతి పనులపై సమీక్షించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్ అధ్యక్షతన జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం మంజూరైన రూ.30కోట్లలో ఇప్పటికే రూ.20కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మిగతా పనులతోపాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కోనారెడ్డి చెరువుకట్ట మరమ్మతులను వేగంగా చేపట్టాలని సూచించారు. పట్టణ ప్రగతిలో సుమారు రూ.9.37కోట్ల మేరకు పనులు చేపట్టినట్లు తెలిపారు.
వర్ధన్నపేట జాతీయ ప్రధాన రహదారికి ఇరువైపులా రోడ్డు వైడింగ్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు త్వరలోనే పక్కా ఇళ్లు మంజూరు చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిరుపేద దళితులకు న్యాయం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నందున, 2వేల మంది ఉద్యోగార్థులకు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా మామునూరు పీటీసీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.ప్రజల కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ, వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్‌ఖన్నా, రైతు సమితి మండల కన్వీనర్ ఏ.మోహన్‌రావు పాల్గొన్నారు.
కంఠమహేశ్వరస్వామికి పూజలు
పర్వతగిరి: అన్నారం షరీఫ్ గ్రామంలో కంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవం, ప్రతిష్ఠాపన మహోత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. గౌడకులస్తులు ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేను గౌడకులస్తులు ఘనంగా సన్మానించారు. జడ్పీటీసీ బానోతు సింగ్‌లాల్, ఎంపీపీ కమల పంతులు, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌కుమార్‌గౌడ్, మార్కెట్ డైరెక్టర్ ఏకాంతంగౌడ్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు సర్వర్, ఎస్కే.షబ్బీర్‌అలీ, బుర్ర యాకయ్య, ఈరగాని సాంబయ్య, మనోహర్, కాంతయ్య, జడల క్రిష్ణ, రంగు జనార్దన్‌గౌడ్, మదన్మోహన్, బాల్లె వెంకటరాజు పాల్గొన్నారు.