భూపాలపల్లి టౌన్/ములుగు టౌన్, ఆగస్టు 30: ఈవీఎం గోదాముల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్ అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్నగర్ లో జిల్లా దవాఖాన ఆవరణలో, ములుగు కలెక్టరే ట్ ఆవరణలో నిర్మిస్తున్న ఈవీఎం గోడౌన్ భవన నిర్మాణ పనులను ఆయన సోమవారం కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అత్యంత విలువైన ఈవీఎంలను భద్రపరిచే ఈ గోదాముల నిర్మాణం చాలా ముఖ్య మైనదని అన్నారు. పనులు నాణ్యతతో జరుగా లని సూచించారు. ఎంత వర్షాలు పడినా స్లాబ్ నుంచి చుక్క నీరు కూడా లోపలికి రావొద్దని, గోడలకు ఎలాంటి తేమ రాకుండా పనులు జరి పించాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీటి నిర్మాణాలు పూర్తయ్యాయని, భూపాలపల్లి, ములుగు, నారాయణపూర్లో మాత్రం జరుగుతు న్నాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలాఖరు వర కు ఈ పనులు పూర్తవుతాయని తెలిపారు. అలాగే కొత్తగా ఏర్పడిన వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఈవీఎంల గోడౌన్లు నిర్మించేందుకు కలెక్టర్లు ప్రతిపాదనలు పంపారని, త్వరలోనే మంజూరు చేసి పనులు పూర్తి చేయిస్తామన్నారు. గోడౌన్లను నాణ్యతతో నిర్మించి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ములుగులో శశాంక్ గోయల్ పోలీ సుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్ర మంలో డీఆర్వో రమాదేవి, ఆర్డీవోలు శ్రీనివాస్, తహసీల్దార్లు ఇక్బాల్, సత్యనారాయణ స్వామి, కలెక్టరేట్ ఏవో శ్యామ్, పంచాయతీరాజ్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ తిరుపతి, ఎలక్షన్ డీటీ రవికు మార్, తదితర అధికారులు పాల్గొన్నారు.
కోటగుళ్లకు పూర్వవైభవం తేవాలి..
గణపురం: మండల కేంద్రంలోని కోటగుళ్లకు పూర్వవైభవం తేవాలని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్ అన్నారు. సోమవారం ఆయన కోటగుళ్లను సందర్శించగా, ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుడు నరేశ్ తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శశాంక్ గోయ ల్-ప్రియాంక దంపతులు, కలెక్టర్ కృష్ణ ఆదిత్యను శాలువాతో సన్మానించారు. అనంతరం గోయల్ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్ట, కోటగుళ్లలోని శిల్పాలు, మైలారంలోని నల్ల గుహలు చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు.