వరంగల్, సెప్టెంబర్ 5 : కొత్త ఇంటి నంబర్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఇచ్చే సెల్ఫ్ అసెస్మెంట్లో తప్పుడు కొలతలు నమోదు చేస్తే అధికారులు జరిమానా విధిస్తున్నారు. తప్పుడు సమాచారం అందించిన వారికి 2019 నుంచి 2021 జూన్ వరకు వచ్చే ఆస్తి పన్నుపై 25 రెట్లు పెనాల్టీ విధిస్తున్నారు. కాగా, కొత్త మున్సిపల్ చట్టంలోని యాక్ట్ బల్దియాకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతోంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 23-7-2019 నుంచి గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 5128 గృహాలకు కొత్త ఇంటి నంబర్ కోసం సెల్ఫ్ అసెస్మెంట్లు నమోదు చేశారు. అందులో ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు 4753 ఇళ్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అందులో 2847 సెల్ఫ్ అసెస్మెంట్లో ఇచ్చిన ఇంటి కొలతల్లో తేడా ఉన్నట్లు గుర్తించిన గ్రేటర్ అధికారులు వాస్తవ ఇంటి పన్నుపై 25 రెట్లు పెనాల్టీ విధించారు. జరిమానా రూపేణా రూ.24.21 కోట్లు వసూలు చేశారు.
విస్తృత ప్రచారం..
25 రెట్ల పెనాల్టీపై ప్రజలకు అవగాహన కల్పించే దిశలో బల్దియా చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం ఇంటి కొలతలను తప్పుగా ఇవ్వొద్దని నగర ప్రధాన కూడళ్లలో హోర్డింగ్లు, బ్యానర్లు కట్టారు. కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. సెల్ఫ్ అసెస్మెంట్లో ఇంటి కొతలను తప్పుగా చూపితే జరిమానా తప్పదని హోర్డింగ్లు ఏర్పాటు చేశారు.
వాస్తవ సమాచారం ఇవ్వాలి..