జనగామ చౌరస్తా, ఆగస్టు 6 : ప్రత్యేక రాష్ట్ర సాధనకు అలుపెరగని పోరాటం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని వక్తలు పేర్కొన్నారు. జయశంకర్ సార్ జయంతి వేడుకలను శుక్రవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గుజ్జ్జ సంపత్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ చైర్పర్సన్ బాల్దె విజయ సిద్ధిలింగం ఆధ్వర్యంలో, మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పోకల జమున లింగయ్య, కమిషనర్ నరసింహ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. వీవర్స్ కాలనీలో 11వ వార్డు కౌన్సిలర్ పాక రమ, 12వ వార్డులో కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మి, విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ సార్‌కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. జనగామ వెస్ట్ జోన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డీసీపీ బీ శ్రీనివాస్‌రెడ్డి ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులఅర్పించారు. ఇది లాఉండగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ డిప్యూటీ సీఈవో వసంత జయశంకర్ సార్ చిత్రపటం వద్ద నివాళులర్పించి మాట్లాడారు.
బచ్చన్నపేటలో..
బచ్చన్నపేట : మండల కేంద్రంలోని జయశంకర్‌సార్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, పీఏఎసీఎన్ చైర్మన్ పూర్ణచందర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కల్లూరి సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ బావండ్ల కృష్ణంరాజు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు షబ్బీర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గందమల్ల నరేందర్, నాయకులు మల్లవరం అరవింద్‌రెడ్డి, దస్తగిరి, హైమద్, సిద్ధులు, సురేశ్, శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, వే ణు పాల్గొన్నారు. మండల పరిషత్‌లో ఎంపీడీవో రఘురామకృష్ణ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో..
స్టేషన్ ఘన్పూర్ : జయశంకర్‌సార్ జయంతిని మం డల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, గ్రామపంచాయతీ, ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాచర్ల గణేశ్, సర్పంచ్ తాటికొండ సురేశ్‌కుమార్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. పీఏసీఎస్ డైరెక్టర్ తోట సత్యం, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, గుర్రం రాజు, టీ ఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మునిగెల రాజు, వార్డు సభ్యులు లక్ష్మి, వేణు, టీఆర్ఎస్ మండల యూ త్ అధ్యక్షుడు ప్రసాద్, గుండె మల్లేశ్, బొంకూరి మహేశ్, పిట్టల అనిల్, తోట వేణు, అశోక్, హరీశ్, మురళీకృష్ణ, భానుప్రకాశ్ పాల్గొన్నారు.