హనుమకొండ, జూలై 9 : మత్తు పదార్థాల నిర్మూలన ప్రజా ఉద్యమంగా మారాలని.. డ్రగ్స్ రహిత భారత్, తెలంగాణ సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఆయన పర్యటించారు. నిట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న గవర్నర్‌కు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకున్న గవర్నర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్-డ్రగ్స్ రహిత తెలంగాణ’ కార్యక్రమంలో పాల్గొని మత్తు పదార్థాల దుష్పరిణామాల అవగాహన పోస్టర్‌ను ఆవిషరించా రు. కార్యక్రమంలో ప్రతి ఒకరూ భాగస్వాములు కావాలని చేపట్టిన సంతకాల సేకరణలో గవర్నర్‌తో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు సంతకాలు చేశా రు.
అనంతరం విద్యార్థులు, యువత, అధికారులు, ప్రజలతో కలిసి ‘న షా ముక్త్ భారత్’ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ ఎక్సైజ్, యాంటీ నా రోటిక్స్ బ్యూరో, పోలీస్, జిల్లా మహికా శిశు, దివ్యాంగుల సంక్షేమ శా ఖల ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడా రు. మత్తు రహిత సమాజ నిర్మాణం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి వ్యక్తి బాధ్యత అన్నారు. ‘ఆటలు ఆడించండి.. మత్తును పారద్రోలండి’ అనే సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించి మహిళల కృషిని అభినందించారు. వారు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తుల గురించి తెలుసుకున్నారు. అలాగే వివిధ శాఖల పనితీరు, సం క్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై హనుమకొం డ, వరంగల్ జిల్లా అధికారులతో సమీక్షించారు. అనంతరం రెడ్‌క్రాస్‌ను సందర్శించి తలసేమియా పేరెంట్స్ లాంజ్‌ను ఆవిష్కరించి, చిన్నారులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. అక్కడి నుంచి పెద్దమ్మగడ్డలోని తె లంగాణ గిరిజన సంక్షేమ జూనియర్ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ బాలికల కళాశాలను గవర్నర్ సందర్శించారు.
విద్యార్థులే భారత భవిష్యత్తు నిర్మాణ శిల్పులని, లక్ష్యాన్ని నిర్ధేశించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని గవర్నర్ పిలుపునిచ్చారు. అనంతరం గవర్నర్ భద్రకాళీ అమ్మ వారిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్, వరంగల్ సీపీ శ్వేత, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, అదనపు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, వైవీ గణేశ్, డిసీపీ దార కవిత, రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణగౌడ్, కోశాధికారి బీ పాపిరెడ్డి, రాష్ట్ర పాలక వర్గ సభ్యుడు ఈవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.