18న ప్రత్యేక లోక్ అదాలత్
ఈ నెల 18న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సెషన్స్ డివిజన్ నాంపల్లి, హైదరాబాద్ గౌరవ చైర్పర్సన్, సెషన్స్ జడ్జి కే సాయిరమాదేవి కోరారు.
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఈ నెల 18న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సెషన్స్ డివిజన్ నాంపల్లి, హైదరాబాద్ గౌరవ చైర్పర్సన్, సెషన్స్ జడ్జి కే సాయిరమాదేవి కోరారు. ఆమె గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. చెకు బౌన్స్ కేసులను సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా పరస్పర రాజీ ద్వారా త్వరితగతిన పరిషరించేందుకు ప్రత్యేక లోక్ అదాలత్ అత్యంత సమర్థ వేదిక అని అన్నారు.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ పి. సామ్ కోశీ ఆదేశాల మేరకు.. సభ్య కార్యదర్శి పంచాక్షరి సూచనలతో ఈ నెల 18న మనోరంజన్ కాంప్లెక్స్ నాంపల్లి, సికింద్రాబాద్ కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉండి అర్హత కలిగిన అన్ని సెక్షన్ 138 ఎన్ఐ యాక్ట్ కేసులను ప్రత్యేక లోక్ అదాలత్కు విస్తృతంగా రిఫర్ చేయాలని, బ్యాంకులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలు తమ ఖాతాదారులను రాజీకి ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పీ అరుణ కుమారి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

