వరంగల్, డిసెంబర్ 17 : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హనుమకొండ జిల్లాను తాకింది. జిల్లాలో తొలి కేసు నమోదు కావడంలో వైద్య శాఖ ఒక్కసారిగా అప్రమత్తమయ్యిం ది. సుబేదారి శాంతినగర్‌కు చెందిన మహిళకు ఒమిక్రా న్ సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. చెక్‌రిపబ్లిక్ దేశంలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న భర్త, భార్య, ఏడాదిన్నర పాపతో ఈ నెల 2న ఇండియాకు వచ్చారు. వారికి ఎయిర్‌పోర్ట్‌లో పరీక్షలు చేయగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. తర్వాత 8 రోజులకు జిల్లా వైద్యాధికారులు రెండోసారి ముగ్గురి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయ గా 29 ఏళ్లున్న మహిళకు పాజిటివ్ వచ్చింది. జీనోమ్ స్వీక్వెన్స్ కోసం హైదరాబాద్‌కు శాంపిల్ పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయిందిని జిల్లా వైద్యాధికారులు వెల్లడించా రు. హనుమకొండ జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు న మోదు కావడంతో వైద్యశాఖ అలర్ట్ అయ్యింది. ఒమిక్రాన్ వచ్చిన బాధిత మహిళను జిల్లా వైద్యాధికారులు వెంటనే హైదరాబాద్‌లోని తెలంగాణ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టీమ్స్)కు తరలించారు.
అప్రమత్తమైన వైద్యశాఖ..
జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒమిక్రాన్ వచ్చిన మహిళ నివాసం ఉండే అపార్ట్మెంట్లో నివాసం ఉండే కుటుంబాలకు చెందిన సభ్యులందరి శాంపిళ్లు సేకరించారు. స్పెన్సర్స్ సమీపంలోని ఈ అపార్ట్మెంట్లో ఎనిమిది కుటుంబాల్లో 30మంది ఉంటున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. మొత్తంగా 30మంది నివాసం ఉంటున్నారని వారందరి శాంపిళ్లు సేకరించి పరీక్షల కోసం కాకతీయ మెడికల్ కాలేజీలోని ల్యాబ్‌కు పంపామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి తెలిపారు. శనివారం పరీక్షలకు సంబందించిన రిపోర్ట్లు వస్తామని ఆమె అన్నారు. ఒమిక్రాన్ విస్తరించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.
వారం పాటు హైపోక్లోరైట్‌తో శుద్ధి..
ఒమిక్రాన్ వచ్చిన మహిళ నివాసం ఉంటున్న ఆపార్ట్‌మెంట్‌ను వారం రోజుల పాటు హైపోక్లోరైట్ ద్రావణంతో శుద్ధి చేయనున్నారు. ఉదయం, సాయంత్రం రెండు సార్లు అపార్ట్మెంట్లోని ప్లాట్లతో పాటు ప్రాంగ ణం అంతా హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందులోని వారంతా హోం క్వారంటైన్లో ఉండాలని వైద్యాధికారులు ఆదేశించారు. రిపోర్ట్ వచ్చేవరకూ బయటికి రావద్దన్నారు.
ఫస్ట్, సెకండ్ కాంటాక్ట్ కోసం ఆరా..
ఒమిక్రాన్ వచ్చిన మహిళతో ఫస్ట్, సెకండ్ కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో పడ్డారు వైద్యాధికారు లు. విదేశం నుంచి వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిశారనే వివరాలను బాధిత కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. పార్టీలు, హోటల్స్‌కు వెళ్లారా? ఎక్కడెక్కడ షా పింగ్ చేశారనే వివరాలు సేకరిస్తున్నారు. బంధువుల ఇ ళ్లకు వెళ్లారా అని అడిగి తెలుసుకుంటున్నారు. ఒమిక్రా న్ వచ్చిన మహిళ భర్త నుంచి పూర్తి సమాచారం సేకరించి వారిని గుర్తించే పనిలో వైద్యశాఖ అధికారులు ని మగ్నమయ్యారు. ఒమిక్రాన్ బాధిత కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం వారిని గుర్తించి శాంపిల్స్ తీసుకుంటామని వైద్యాధికారులు చెబుతున్నారు.
జాగ్రత్తలు పాటించాలి..