హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 16: నగరంలోని పలు ఆలయాల్లో శ్రావణ సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామికి అభిషేకం చేసి, 112 మంది దంపతులతో పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ పాల్గొన్నారు.
మల్లన్న ఆలయంలో..
ఐనవోలు : మల్లికార్జునస్వామి ఆలయంలో బిల్వార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సంపత్‌కుమార్, ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ పాల్గొన్నారు.
కాశీవిశ్వేశ్వరుడికి లక్ష పుష్పార్చన
వరంగల్ చౌరస్తా : స్టేషన్ రోడ్డులోని కాశీవిశ్వేశ్వరాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, 21 రకాల పువ్వులతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ప్రధానార్చకుడు లంకా శివకుమార్, హరీశ్-స్వాతి దంపతులు, ఈవో వెంకట్రావ్, శార్వాణి, నాగలక్ష్మి, సౌమ్య, పద్మ, అభిషేక్, గోవర్ధన్, వీరన్న, సాగర్ పాల్గొన్నారు.
కాశీబుగ్గలో..
కాశీబుగ్గ : కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో 27 లీటర్ల పెరుగుతో అభిషేకం నిర్వహించారు. బయ్యస్వామి, ఓరుగంటి కొమురయ్య, వెంకన్న, వడిచెర్ల సదానందం, డాక్టర్ గోనే జగదీశ్వర్, మండల శ్రీరాములు, బోడకుంట్ల వైకుంఠం పాల్గొన్నారు.
మెట్టుగుట్టపై..
మడికొండ : మడికొండ మెట్టుగుట్టపై శ్రీస్వయంభూలింగేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నపూజ చేశారు. అలాగే, శ్రీసీతారామచంద్రస్వామి వారికి విశేష అర్చనలు జరిపించారు. అర్చకులు రాగిచేడు అభిలాషశర్మ, పరాశంర విష్ణువర్ధనాచార్యులు, పారుపల్లి సత్యనారాయణశర్మ, ఈవో వీరస్వామి, చైర్మన్ రవీందర్ పాల్గొన్నారు.