కమలాపూర్, సెప్టెంబర్ 5 : సొంత మండలమని చెప్పుకుంటున్న బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు కమలాపూర్ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మండలంలోని గుండేడులో పలు అభివృద్ధి పనులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశా రు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2009కి ముందు కమలాపూర్ నియోజకవర్గంగా ఉండేదని, పునర్విభజనలో కమలాపూర్ పోయి హు జూరాబాద్ నియోజకవర్గంగా ఏర్పడిందన్నారు. అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ కమలాపూర్ నియోజకవర్గం పోతున్నప్పుడు ఎందుకు ఆపలేకపోయారన్నారు. ఔటర్ రింగు రోడ్డులో భూములు పోతున్నాయని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఈటల రాజేందర్ కలిశారని గుర్తుచేశారు. సొంత ఆస్తుల కోసం వైఎస్‌ను కలిసిన ఈటల.. కమలాపూర్ నియోజకవర్గం కోసం ఎందుకు కలువలేదని ప్రశ్నించారు. కమలాపూర్‌పై ఈటల రాజేందర్‌కు ఎలాంటి ప్రేమలేదన్నారు. కమ్యూనిస్టులు, అంబేద్కర్ వాదులు, పూలే వారసుల ప్రాంతం హుజూరాబాద్ అన్నారు. ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మతతత్వ బీజేపీలో ఎలా చేరావో ఈటల రాజేందర్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ రైతు, యువత, తెలంగాణ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని విమర్శించారు. రాబోయే ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.
ఈటల చేసిందేమీలేదు
ఏడేండ్లు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ గ్రామాల్లో చేసిందేమీ లేదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రామాల్లో రహదారులు పూర్తి కాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు.
రూ.12కోట్ల పనులకు శంకుస్థాపన
మండలంలోని భీంపల్లి, కొత్తపల్లి, గుండేడు, జూజునూర్‌పల్లి, పంగిడిపల్లి, గోపాల్పూర్ గ్రామాల్లో విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. భీంపల్లి నుంచి ధర్మరాజుపల్లి వరకు రూ.2కోట్లతో బీటీ రోడ్డు, రూ.కోటితో కొత్తపల్లి నుంచి పంగిడిపల్లి క్రాస్ రోడ్డు పనులు, గుండేడులో రూ.1.60కోట్లతో అంతర్గత సీసీరోడ్లు, కమ్యూనిటీ భవనాలు, రూ.4.15 కోట్లతో గుండేడు నుంచి పంగిడిపల్లికి బిటీ రోడ్డు, రూ.3.50కోట్లతో వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.1.25కోట్లతో జూజునూర్‌పల్లి క్రాస్ రోడ్డు నుంచి జూజునూర్పల్లికి బిటీ రోడ్డు, పంగిడిపల్లి గ్రామంలో రూ.29లక్షలతో అభివృద్ది పనులు, రూ.1.60లక్షలతో గోపాల్పూర్ నుంచి ముస్త్యాలపల్లి వరకు బిటీ రోడ్డు పనులు ప్రారంభించారు. కాగా, భీంపల్లి గ్రామం లో ఖాతాల్లో రూ.పదిలక్షలు పడ్డాయని సంతోషంతో దళితులు సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లను ఎమ్మెల్యే ధర్మారెడ్డికి చూపించారు. గుండేడు గ్రామానికి చెం దిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాంపల్లి ప్రభాకర్ టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆయనకు గులాబీ కండువా కప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు జవ్వాజి పద్మ, బండారి కల్యాణి, లక్ష్మణ్‌రావు, లడె గోపాల్, జడ్పీటీసీ లాండిగ కల్యాణి, సింగిల్ విండో చైర్మన్ సంపత్‌రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణరావు, మండల ఇన్చార్జి పేర్యాల రవీందర్రావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, ఎంపీటీసీ సుగుణాకర్‌రావు, నవీన్‌కుమార్, లక్ష్మణ్‌రావు, సారంగపాణి