e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జిల్లాలు కేసుల భయంతోనే బీజేపీలోకి ఈటల

కేసుల భయంతోనే బీజేపీలోకి ఈటల

కేసుల భయంతోనే బీజేపీలోకి ఈటల

పేదలకు ఆ పార్టీ చేసిందేలేదు
రైతుబంధును వ్యతిరేకించిన ఈటలపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం

కమలాపూర్‌, జూన్‌ 16 : ఈటల రాజేందర్‌ భూ కబ్జాల కేసులను నిరూపించుకోలేకే.. భయంతో బీజేపీలో చేరాడంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని అంబాల, గూడూరు, శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజ్‌పల్లి, కమలాపూర్‌ గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేలకోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన ఈటల.. తల్లిలాంటి టీఆర్‌ఎస్‌ పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల కబ్జా చేసిన ప్రభుత్వ భూ ములను ఎందుకు ప్రభుత్వానికి అప్పజెప్పడం లేదని నిలదీశారు. రైతుబంధును వ్యతిరేకించి రూ.26లక్షలు రైతుబంధు ఎందుకు తీ సుకుంటున్నాడో ప్రజలకు చెప్పాలన్నారు.

కేసీఆర్‌ దయవల్లే పార్టీలో ఎదిగిన విషయం ఈట ల గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటుంటే ఈటల మాత్రం ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఐదేళ్ల నుంచే కుట్ర పన్నిన్నట్లు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీ సుకువస్తే వ్యతిరేకించిన ఈటల మళ్లీ ఆ పార్టీ లో చేరి రైతుల వ్యతిరేకిగా మారాడన్నారు. బీజేపీ మత రాజకీయాలు చేయడం తప్ప ప్ర జలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. గ్రామాల్లో నెలకొన్న అసంపూర్తిగా ఉన్న కులసంఘ భవన నిర్మాణాలు, రోడ్లు, అంతర్గత రహదారులు నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి మూడు నెల ల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సమావేశంలో కుడా చైర్మన్‌ మర్రి యాదవరె డ్డి, ఇన్‌చార్జి పేరియాల రవీందర్‌రావు, సర్పంచ్‌లు కట్కూరి విజయాతిరుపతిరెడ్డి, పెండ్యా ల రవీందర్‌రెడ్డి, అంకతి సాంబయ్య, దాసరి రమేశ్‌, ఎంపీటీసీలు వెంకటేశ్వర్లు, శైలజ, వెంకటేశ్వర్లు, సింగిల్‌ విండో చైర్మన్‌ సంపత్‌రావు, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్‌ సంపత్‌రా వు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కేసుల భయంతోనే బీజేపీలోకి ఈటల
కేసుల భయంతోనే బీజేపీలోకి ఈటల
కేసుల భయంతోనే బీజేపీలోకి ఈటల

ట్రెండింగ్‌

Advertisement