హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11 : హనుమకొండలోని వన్ షాపింగ్ మాల్‌ను ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సినీతార కాజల్ అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… కాసం నమఃశివాయ వరంగల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా అనేక షోరూమ్‌లను ప్రారంభించినట్లు తెలిపారు. బహుళ అంతస్తుల్లో విశాలంగా విస్తరించిఉన్న వన్ షాపింగ్ మాల్లో అన్ని వయసుల వారికి సరికొత్త డిజైన్లలో దుస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. వన్ షాపింగ్ మాల్ చైర్మన్ కాసం నమఃశివాయకు వస్త్ర రంగంలో అపార అనుభవం ఉందని, నాణ్యమైన దుస్తులను అత్యంత సరసమైన ధరలకు అందిస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతున్నట్లు తెలిపారు. మహిళలకు అనేక రకాల చీరెలు, లెహంగాలు, వెస్ట్రన్, వెడ్డింగ్ వేర్స్, డ్రెస్ మెటీరియల్స్, పిల్లలు, యువతుల కోసం పార్టీ, పండుగ దుస్తులు, కేటలాగ్ చీరెలు, కాంచీపురం పట్టు, ఉప్పాడ, హైఫ్యాన్సీ చీరెలు, సల్వార్లు, కుర్తా, పైజామాలు,పురుషులకు అధునాతన దోవతులు, షర్టులు, టీ-షర్టులు, జీన్స్, వివాహ, పండుగ దుస్తులు మరెన్నో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, వొడితెల సతీశ్ కుమార్, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్, మాజీ కార్పొరేటర్ గణేశ్ పాల్గొన్నారు.
ఓరుగల్లులో సినిమాలు తీస్తే షూటింగ్లో పాల్గొంటా..: హీరోయిన్ కాజల్
చారిత్రక ఓరుగల్లు నగరంలో సినిమాలు తీస్తే షూటింగ్లో పాల్గొంటానని హీరోయిన్ కాజల్ అగర్వాల్ అన్నారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం ఆమె మాట్లాడుతూ.. హనుమకొండలో వన్ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించడం ఒక మహత్తరమైన సందర్భమని, ఈ మాల్ దేశం మొత్తం విస్తరించబోతున్నదన్నారు. ఫ్యాషన్ దుస్తులకు గ్లోబల్ చైన్ ఆఫ్ స్టోర్స్‌గా మారనుందన్నారు. కుటుంబమంతటికీ వారి అభిరుచులకు తగినట్లుగా ఒకే చోట దుస్తులు లభిస్తాయన్నారు. రాబోయే తన చిత్రం భారతీయుడు-2తోపాటు మరో రెండు తమిళ చిత్రాలలో నటించనున్నట్లు తెలిపారు. ఇంతకుముందు మాట ఇచ్చినట్లుగా వరంగల్‌లో ఏదో ఒక సినిమా షూటింగ్లో పాల్గొంటానన్నారు.