సోమవారం 26 అక్టోబర్ 2020
Warangal-city - Aug 15, 2020 , 06:23:35

‘అత్యున్నత’ గౌరవం

‘అత్యున్నత’ గౌరవం

  • సీపీ ప్రమోద్‌కుమార్‌కు రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌..
  • ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు అడిషనల్‌ కమాండెంట్‌ జయరాజు ఎంపిక
  • ఇద్దరికీ ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అభినందనలు

 వరంగల్‌ క్రైం : భారత ప్రభుత్వం అందించే రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌కు వరంగల్‌ ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌ పీ ప్రమోద్‌కుమార్‌ ఎంపికయ్యారు. 1991లో పోలీస్‌ శాఖలో డీఎస్పీగా చేరిన ప్రమోద్‌కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పనిచేసి ఐజీ స్థాయికి చేరుకున్నారు. 2019 నుంచి సీఐడీ విభాగం ఐజీగా పనిచేస్తున్న ఆయన కరీంనగర్‌, వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. జాన్‌ 30 నుంచి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. కాగా పీపీఎం (ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌)కు ఎంపికైన సందర్భంగా కమిషనరేట్‌ పోలీస్‌ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలిపారు. 

 ఐపీఎంకు జయరాజు..

మామునూర్‌ నాలుగో బెటాలియన్‌ అడిషినల్‌ కమాండెంట్‌ ఎం జయరాజు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ (ఐపీఎం)కు ఎంపికయ్యారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి బెటాలియన్‌కు శుక్రవారం సమాచారమందించారు. 1991లో ఆర్‌ఎస్సైగా పోలీస్‌శాఖలో చేరిన ఆయన, ప్రస్తుతం అడిషనల్‌ ఎస్పీ ర్యాంకులో మామూనూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటివలే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నుంచి మహోన్నత సేవా పతకం సైతం పొందారు. ఐపీఎంకు ఎంపిక కావడంపై బెటాలియం అధికారులు, సిబ్బంది జయరాజుకు అభినందనలు తెలిపారు.  
logo