శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jun 21, 2020 , 02:30:55

బైపాస్‌ రోడ్డు రద్దుకు కృషి చేస్తా

బైపాస్‌ రోడ్డు రద్దుకు కృషి చేస్తా


హసన్‌పర్తి, జూన్‌ 20: జాతీయ రహదారి 563 బైపాస్‌ రోడ్డు రద్దుకు కృషి చేస్తానని వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ రైతులకు హామీ ఇచ్చారు. మండలంలోని ఏడు గ్రామాల రైతులు ఇటీవల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయంపై భూనిర్వాసితుల పరిరక్షణ కమిటీ సభ్యులు శనివారం వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను కలిసి వినతిఅందజేశారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గతంలో ఎల్లాపూర్‌ నుంచి హసన్‌పర్తి మీదుగా చింతగట్టు వరకు పూర్వపు రహదారిని 150 ఫీట్లకు విస్తరిస్తూ ‘కుడా’ రోడ్డును తక్కువ ఖర్చుతో 3కి.మీ.మేర ఎన్‌హెచ్‌-563 రహదారి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసిన విషయాన్ని పీడీకి వివరించారు. ప్రస్తుతం కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం జాతీయ రహదారి ఎల్లాపూర్‌ నుంచి సీతంపేట క్రాసు మీదుగా పలివేల్పుల వరకు 9 కి.మీ. దూరం రావడంతో ప్రభుత్వం మీద అధిక ఆర్థిక భారం పడటమే కాకుం డా పంట భూములు కోల్పోయి 1200 మంది రైతులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని వివరించారు. తక్షణమే ఎల్లాపూర్‌, సీతంపేట, గంటూర్‌పల్లి మీదుగా పలివేల్పుల వరకు నిర్మించనున్న జాతీయ రహదారి 563ని రద్దు చేసి పూర్వపు రహదారినే జాతీయ రహదారిగా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని పీడీని కోరారు.  ఎమ్మెల్యేను కలిసిన వారిలో  కమిటీ సభ్యులు కందుకూరి చంద్రమోహన్‌, మారపల్లి రాంచంద్రారెడ్డి, పిట్టల కుమారస్వామి, నేదునూరి కోటేశ్వర్‌రావు, వీసం సురెందర్‌రెడ్డి, గోల్లె వెంకట్రాంరెడ్డి, వెలిశోజు ఓంకారాచారితో పాటు  రైతులు ఉన్నారు. logo