గురువారం 04 జూన్ 2020
Warangal-city - Apr 16, 2020 , 03:47:50

పేదలు ఉపవాసం ఉండొద్దు

పేదలు ఉపవాసం ఉండొద్దు

  • పేదలు ఉపవాసం ఉండొద్దు
  • మంత్రి సత్యవతి రాథోడ్‌  
  • నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ సమయంలో పేదలు ఉపవాసం ఉండకుండా చూడడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. బుధవారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని సిగ్నల్‌ కాలనీ ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో వంద మంది పేదలకు సిరికట్టె సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయంలో స్పందించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పేద కుటుంబాలు ఇబ్బందిపడొద్దనే 12 కేజీల బియ్యం, రూ. 1,500 నగదును అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిరికట్టె సంఘం బాధ్యులు సాదుల సరిత, మాశెట్టి శైలజ, ఉష, శ్రీదేవిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో సులోచన, జహేరా, రమ, విజయలక్ష్మి, రజిత, చందా పాల్గొన్నారు.


logo