బుధవారం 01 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 16, 2020 , 03:13:54

హాకీ ఆణిముత్యం స్రవంతి

హాకీ ఆణిముత్యం స్రవంతి

దుగ్గొండి, ఫిబ్రవరి 15 : నిరుపేద కుటుంబంలో పుట్టి చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నది. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు అరుదుగా ఆడే హాకీ క్రీడనే కెరీర్‌గా ఎంచుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తూ పలువురి మన్నలను పొందుతున్నంది.  చిన్నతనం నుంచే హాకీ క్రీడలోక్రమక్రమంగా రాణిస్తూ జాతీయస్థాయికి ఎదిగింది. దుగ్గొండి మండలం శివాజీనగర్‌ గ్రామానికి చెందిన సర్పంచ్‌ లింగంపల్లి ఉమ-రవీందర్‌రావు దంపతుల కూతురు లింగంపల్లి స్రవంతి. కోచ్‌, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో హాకీలో ప్రతిభ కనబరుస్తున్నది. మండలంలోని శివాజీనగర్‌ గ్రామానికి చెందిన స్రవంతి చిన్నతనం నుంచే హాకీ క్రీడలో ఆసక్తిని కనబరుస్తున్నది. ఆమె ఆసక్తిని గమనించిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు జిల్లాస్థాయిలో హాకీపై శిక్షణ ఇచ్చారు. పాఠశాల స్థాయి నుంచే  హాకీ క్రీడను ప్రాక్టీస్‌ చేసింది. ప్రతి రోజు పాఠశాల క్రీడా మైదానంలోకి వెళ్లి వ్యాయామ ఉపాధ్యాయుడు (కోచ్‌)  సాయం తీసుకుని ఆటలో  మెళకువలను నేర్చుకుంది. దీంతో హాకీలో మంచి ప్రావీణ్యం సంపాదించింది.  జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణిస్తూ అనేక పతకాలను సాధించి పాఠశాల, గ్రామం పేరు, తల్లిదండ్రుల పేరును చాటింది. 2013-14 సంవత్సరంలో అండర్‌-14  విభాగంలో హన్మకొండలోని జేఎన్‌ఎస్‌లో రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. స్రవంతి ఈ పోటీల్లో పాల్గొన్ని ప్రతిభ చాటి బంగారు పతకాన్ని సాధించింది. 2014-15వ సంవత్సరంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన అండర్‌-17  విభాగంలో ప్రతిభను చాటి సర్టిఫికెట్‌ సాదించింది. అనంతరం 2015-16 సంవత్సరంలో వనపర్తిలో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలో ప్రతిభను చాటింది. జనవరి 23 తేదీన కేరళ రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి హాకీ పోటీలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా  నుంచి ఎంపికై పాల్గొంది. మొదటిసారిగా జరిగిన జాతీయ హాకీ పోటీల్లో పాల్గొని జట్టు గెలుపులో కీలక భుమిక పోషించి అందరి మన్ననలను పొందింది. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తే  గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. తనకు హాకీ అసోసియేషన్‌ సభ్యులు, కోచ్‌లు ఇచ్చిన ప్రోత్సాహంతోనే పతకాలు, సర్టిఫికెట్లను సాధిస్తానని పేర్కొంది. 


logo
>>>>>>