శనివారం 23 జనవరి 2021
Wanaparthy - Nov 28, 2020 , 01:48:14

జిల్లాలో ముసురు వర్షం

జిల్లాలో ముసురు వర్షం

  •  తడిసిన వరిధాన్యం,  అన్నదాతలకు తీవ్ర నష్టం
  • టార్ఫాలిన్‌ కవర్లు లేక   ఇబ్బందులో రైతులు

వనపర్తి/పెద్దమందడి/కొత్తకోట/వీపనగండ్ల : జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో గురువారం రాత్రి నుంచి ముసురు వర్షం కురుస్తున్నది. దీంతో రైతులు సాగుచేసిన వరిపొలాలు అక్కడక్కడ కోయడంతోపాటు మరికొన్ని చోట్ల కోత దశలో ఉన్నాయి. వరిపొలాలను కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లడంతోపాటు మరికొంత మంది రైతులు తమ పొలాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. ఒక్కసారిగా ముసురు వర్షం పడుతుండడంతో ఆరబెట్టుకున్న వరిధాన్యం తడిసింది. రైతులు ఆరబెట్టుకు న్న ధాన్యంపై కవర్లను కప్పి ఉంచారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో వరిపొలాలు కోత దశలో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుఫాను ఇలాగే కొనసాగితే కోత దశలో ఉన్న వరిపొలాలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తకోట మండలంలో రైతు లు మొత్తం 16,480 ఎకరాలల్లో వరి సాగు చేయగా 10,2 00 ఎకరాలలో వరి పంటను కోయడం జరిగింది. ఇంకా 6,280 ఎకరాలు కొయడానికి సిద్ధంగా ఉంది.


logo