శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Oct 28, 2020 , 02:08:51

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

వాల్మీకి బోయలను  ఎస్టీ జాబితాలో చేర్చాలి

వనపర్తి : వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ ఐక్య వాల్మీకి పోరాట కమిటీ సభ్యులు, రాష్ట్ర జేఏసీ కోకన్వీనర్‌ ఉంగ్లం తిరుమల్‌ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సంఘం సభ్యులతో కలిసి ఆయన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను హైదరాబాద్‌లోని ఆమె చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి సంబంధించిన ఫైల్‌ గురించి మంత్రితో ప్రస్తావించామన్నారు. త్వరితగతిన ఎస్టీ జాబితాలో చేర్చుటకు కృషి చేయాలని మంత్రిని కోరినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరిశంకర్‌నాయుడు, నాయకులు సువర్ణలక్ష్మి, వేణుగోపాల్‌, రవికుమార్‌, విజయ్‌కుమార్‌, అయ్యన్న, నారాయణ, రమేశ్‌ నాయుడు, రంగస్వామి పాల్గొన్నారు.