శనివారం 26 సెప్టెంబర్ 2020
Wanaparthy - Aug 15, 2020 , 07:12:43

బోధ‌నా దీక్ష‌

బోధ‌నా దీక్ష‌

  • n 8, 9వ తరగతుల పాఠ్యపుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌
  • n కోడ్‌ను దీక్ష యాప్‌లో స్కాన్‌ చేస్తే చాలు
  • n సులభంగా అర్థమయ్యే రీతితో వీడియోల ద్వారా బోధన
  • n ఇండ్ల వద్దే పాఠాలు నేర్చుకునే అవకాశం

కరోనా నేపథ్యంలో పాఠశాలలు ఎప్పటికి తెరుచుకుంటాయో అనే సందిగ్ధత అందరిలోనూ నెలకొన్నది.. ఇప్పటికే ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసింది.. గతేడాది నుంచి పుస్తకాల మీద విద్యాశాఖ క్యూఆర్‌కోడ్‌ను ముద్రిస్తోంది.. ఈ కోడ్‌ ద్వారా ఏమిటి ఉపయోగం అనేది చాలా మందికి తెలియదు.. కోడ్‌ను ఎలా వినియోగించుకోవాలి..? సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠాలను ఎలా నేర్చుకోవాలి..? అనే విషయాలను తెలుసుకుందాం..  

 - కందనూలు

గతేడాది 8వ తరగతి భౌతిక, జీవశాస్త్రాల్లోని పాఠాలకు మాత్రమే క్యూఆర్‌కోడ్‌ను ముద్రించారు. ఈ ఏడాది 8, 9వ తరగతుల భౌతిక, రసాయన, జీవశాస్త్ర, గణిత సబ్జెక్టుల పాఠాలపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు. అయితే, ఆ కోడ్‌ను ఉపయోగించి ఎలా చదవాలి అనేది ఒక్కసారి పరిశీలిద్దాం

..? స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి దీక్ష యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

..? యాప్‌ ఓపెన్‌ చేసిన వెంటనే వచ్చే పేజీలో 12 భాషలు వస్తాయి. 

..? అందులో మనకు అర్ధమయ్యే భాషను ఎంపిక చేసుకోవాలి. 

..? భాషపై క్లిక్‌ చేయగానే ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతరులు అంటూ మూడు ఆప్షన్లు వస్తాయి. 

..? మనం ఎవరై ఉంటే వాటిని ఎంపిక చేసుకోవాలి. 

..? ఆ తర్వాత క్యూఆర్‌ కోడ్‌స్కానర్‌ వస్తుంది. 

..? పాఠ్యపుస్తకంలోని కోడ్‌ను స్కాన్‌ చేయాలి. పాఠానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం వీడియోలు, చిత్రాల రూపంలో అందుబాటులోకి వస్తుంది. 

..? తరగతిగదిలో బోధించినట్లుగానే పాఠాలు అర్థమయ్యే రీతితో వీడియో వస్తుంది. 

ప్రతి విద్యార్ధికీ ఉపయోగం..

ప్రభుత్వం ప్రచురించిన 8, 9వ తరగతి సైన్స్‌, మ్యాథ్స్‌ పుస్తకాల్లో క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు. ప్రతి పాఠ్యాంశం వెనుక క్యూఆర్‌కోడ్‌ ఉంటుంది. దీనిని దీక్ష యాప్‌లో స్కాన్‌ చేసి చదవండి. ఉపాధ్యాయులు లేని లోటు తీరుతుంది. విద్యార్థులకు సులభమైన రీతిలో పాఠ్యాంశాల బోధన ఉంటుంది.

- గోవిందరాజులు, డీఈవో, నాగర్‌కర్నూల్‌logo