శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Jul 25, 2020 , 01:39:35

రెండు నెల‌ల్లో పూర్తి చేయాలి

రెండు నెల‌ల్లో పూర్తి చేయాలి

  • రైతు వేదిక నిర్మాణాల్లో వేగం పెంచండి
  • రోడ్ల విస్తరణ బాధితులకు డబుల్‌బెడ్రూం ఇండ్లు 
  •   అప్పాయిపల్లిలో నాలుగైదు రోజుల్లో  గృహప్రవేశాలు చేయాలి
  •  పునరావాస సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
  •  సమీక్షలో మంత్రి నిరంజన్‌రెడ్డి 

రైతు వేదిక భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి రెండునెలల్లో పూర్తి చేయాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానను తనిఖీ చేశారు. జిల్లా అభివృద్ధిపై కలెక్టర్‌ యాస్మిన్‌బాషా, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఖిల్లాఘణపురంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు, బీసీ కమ్యూనిటీ హాల్‌ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల విస్తరణ బాధితులకు డబుల్‌బెడ్రూం ఇండ్లు అందిస్తామని చెప్పారు. అప్పాయిపల్లిలో నాలుగైదు రోజుల్లో గృహప్రవేశాలు చేసేలా చర్యలు 

చేపట్టాలని అధికారులకు సూచించారు.

- వనపర్తి/వైద్యం/ఖిల్లాఘణపురం


వనపర్తి : రైతు వేదికల నిర్మాణాలను రెండు నె లల్లో పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్‌తో కలిసి మంత్రి సమీ క్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రైతు వేదికల ని ర్మాణాలు మొదలుపెట్టని చోట తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న రోడ్ల విస్తరణలో నష్టపోయిన బాధితులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలన్నారు. నియోజకవర్గానికి సీఎం కేసీఆర్‌ కొత్తగా 1500 డబుల్‌ బెడ్రూం ఇండ్లను మంజూరు చేశారని, వీటిలో 800 గ్రామీణ ప్రాంతానికి, 700 మున్సిపల్‌ పట్టణ ప్రాంతానికి కేటాయిస్తామన్నారు. వీటి నిర్మాణాలకు స్థలాన్ని గుర్తించి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అప్పాయిపల్లిలో నిర్మించిన 24 ఇం డ్లను రానున్న 4, 5 రోజుల్లో గృహప్రవేశాలు చేసే లా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైనందున పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ కనెక్షన్లు తక్షణమే ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్‌ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలన్నారు. పునారావాస కేంద్రాలకు సం బంధించి బాధితుల బకాయిలను త్వరితగతిన ఇ వ్వాలన్నారు. భూసేకరణకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే ప్రతిపాదనలు పూర్తి చేయాలన్నారు. జిల్లాకు నిర్దేశించిన హరితహారం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్‌, శ్రీవాస్తవ, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 

సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సీఎంసహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను మంత్రి నిరంజన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో బాధితులకు అందజేశారు. జిల్లా కేంద్రానికి చెందిన బాలపీర్‌కు రూ.13,500, శ్రీనుకు రూ.2వేలు, రా జపేటకు చెందిన బుచ్చమ్మకు రూ.12,500, ఏదుట్లకు చెందిన భాగ్యలక్ష్మికి మంజూరైన రూ.13వేల సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. 

వైద్యం కోసం ప్రజలు ఇబ్బంది పడొద్దు

వనపర్తి వైద్యం : వైద్యం కోసం ప్రజలు ఇబ్బంది పడొద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవా రం వనపర్తి జిల్లా దవాఖానను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యం కోసం జిల్లా దవాఖానకు వస్తున్న ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని వైద్యులకు సూచించారు. దవాఖానలో ఉన్న వెంటిలేటర్ల ను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఇంకా ఏమైనా వసతులు కా వాలో చెబితే ప్రభుత్వం నుంచి సమకూరుస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా దవాఖాన ఆర్‌ఎంవో చైతన్యగౌడ్‌, సిబ్బంది, టీఆర్‌ఎస్‌ నా యకులు పాల్గొన్నారు.