పేరు లేని రంగు
అసలీ రంగులెక్కడివి? ముట్టుకోకుండానే చేతిలో పుట్టి కంటిని మరకలతో బాధపెడుతూ ఎదురు తిరుగుతున్నాయి
అసలీ రంగులెక్కడివి?
ముట్టుకోకుండానే చేతిలో పుట్టి
కంటిని మరకలతో బాధపెడుతూ
ఎదురు తిరుగుతున్నాయి
ఏ పేరుతో పిలిచి
పరిచయం చేసుకొని
మురిసిపోతూ
పులుముకోవాలి ముఖానికి?
మనసుకంటని
ఏ రంగును ఐనా ఎలా ప్రేమించాలి?
ఏమని పొగుడుకొని పొంగిపోతూ
సంతోషపడాలి?
కంటిని ఓ రంగు ఆశపెడితే
మనసుపై మరో రంగు దాడి
మాటకు ముందే మరకవుతుంటే
మాట తర్వాత మచ్చ పడుతుంటే
ఏ రంగు మంచిది?
పేరే లేని రంగు ఒకటుంటే బాగుండు..
మరకపడ్డా బాధనేది ఉండదు.
మెరుపులా కురిసినా పట్టింపుండదు..
– చందలూరి నారాయణరావు 97044 37247
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

